అక్కాతమ్ముళ్లపై దాడి.. | brother and sister attacked by locals | Sakshi
Sakshi News home page

అక్కాతమ్ముళ్లపై దాడి..

Published Wed, Apr 20 2016 11:05 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

brother and sister attacked by locals

సంతోష్‌నగర్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అక్కాతమ్ముళ్లపై ఓ వర్గానికి చెందిన యువకులు దాడిచేసిన సంఘటన బుధవారం హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... ఉప్పుగూడ సాయిబాబానగర్ ప్రాంతానికి చెందిన ఆయేషా అలియాస్ కవిత మల్లేష్ అక్కాతమ్ముడు. కవిత కొన్ని నెలల క్రితం ఆటో డ్రైవర్ ఆసీఫ్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా కవిత తన పేరును ఆయేషాగా మార్చుకుంది.

ఇదిలా ఉండగా బుధవారం మిధాని చౌరస్తాలో కవిత, మల్లేష్‌లు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా... స్థానికంగా ఉండే ఓ వర్గానికి చెందిన యువకులు బుర్ఖాలో ఉన్న ఆయేషాను చూసి అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావని గొడవ పడ్డారు. తమ సోదరిని తీసుకెళ్తున్నానని చెబుతుండగానే తీవ్రస్థాయిలో దుర్భాషలాడి ఇద్దరిని చితకబాదారు. ఈ సంఘటనలో గాయాలపాలైన మల్లేష్, ఆయేషాలుపోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement