
జీతం కోసం సెల్ టవరెక్కాడు
అనంతపురం: కష్టపడి పనిచేసిన జీతం ఇవ్వలేదు.. ఇదేంటి అని మొరపెట్టుకున్నా.. పట్టించుకునే వాళ్లు లేరు. దీంతో విసుగు చెందిన ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవాడ ఓ ప్రైవేటు కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి జీతం సరిగ్గా ఇవ్వడంలేదని ఈమధ్యే ఉద్యోగం మానేశాడు.
అప్పటినుంచి అనంతపురంలోనే ఉంటున్నాడు. తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వాల్సిందిగా.. పలుమార్లు అడిగినా కళాశాల యాజమన్యం పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన భాస్కర్ బుధవారం తెల్లవారుజామన పట్టణంలోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందికి దించె ప్రయత్నం చేస్తున్నారు.