
సాక్షి, అనంతరపురం : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు విజయ్ భాస్కర్ సెల్ టవర్ ఎక్కారు. ధర్మవరంలో శనివారం సెల్ టవర్ ఎక్కిన విజయ్ భాస్కర్ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల వరంగల్‌లో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిందే. చిత్తూరులో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం విధితమే.