AP: కీలక దశకు కొత్త జిల్లాల ఏర్పాటు.. ఏప్రిల్ 2 నుంచి పాలన | AP Planning Secretary Vijayakumar Visited Anantapur District | Sakshi
Sakshi News home page

AP: కీలక దశకు కొత్త జిల్లాల ఏర్పాటు.. ఏప్రిల్ 2 నుంచి పాలన

Published Sat, Feb 26 2022 1:46 PM | Last Updated on Sat, Feb 26 2022 3:08 PM

AP Planning Secretary Vijayakumar Visited Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుందని.. మార్చి 3 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టర్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని.. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని పేర్కొన్నారు.

AP: సమయానికి రాకపోతే ‘సెలవే’

ఆర్డర్‌ టూ వర్క్‌ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని విజయ్‌కుమార్‌ తెలిపారు.

అనంతపురంలో పర్యటించిన ఉన్నతస్థాయి కమిటీ
కొత్త జిల్లాల ఏర్పాటు కీలక దశకు చేరింది. ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ శనివారం అనంతపురంలో పర్యటించింది. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారుల బృందం భేటీ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలకు సంబంధించిన వివరాలు.. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయాలపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లు నివేదికలను అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement