
సాక్షి, విజయవాడ: కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయ్ కుమార్ గురువారం ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్ కుమార్ తెలిపారు.
చదవండి: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు.. 63కు చేరిన మొత్తం.. పూర్తి వివరాలు
‘అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నాం. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధిలో ఉంది. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం ఆలోచించి రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయి. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపాం. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాంను ఆ జిల్లాలో కలిపాం. విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశాం. పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాం ఉంది. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశాం. రంపచోడవరం అభివృద్ధి కోసమే అల్లూరి జిల్లాలో కలిపాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment