revenue divison
-
చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు మండలాల ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాలను కలిపి కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది జూలై 27న వరదప్రాంతాల పరిశీలనకు చింతూరు మండలం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుయిగూరులో మాట్లాడారు. కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీఇచ్చారు. మాట ఇచ్చిందే తడవుగా ఆయన కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియకు చకచకా చర్యలు చేపట్టారు. ► రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వరద ప్రాంతాల పర్యటనకు సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి వెనువెంటనే అమల్లోకి తెచ్చారు. ► సెప్టెంబరు ఏడున జరిగిన మంత్రివర్గ సమావేశంలో చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. అనంతరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలపై నోటిఫికేషన్ జారీఅయింది. ఆ గడువు ముగియడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ► ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం పట్ల చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటివరకు పాడేరు, రంపచోడవరం రెండు రెవెన్యూ డివిజన్లు వుండగా, కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఆ సంఖ్య మూడుకు పెరిగింది. ► కొత్తగా ఏర్పాటైన చింతూరు డివిజన్లో మొత్తం 1,35,082 మంది జనాభా వుండగా 90,929 మంది ఓటర్లున్నారు. వీరిలో 82,992 మంది ఎస్టీ జనాభా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. సర్వత్రా హర్షం మాట ఇస్తే నిలబెట్టుకోవడం తన నైజమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పేర్కొన్నారు. ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చింతూరు మండలం కుయిగూరు, చట్టిలో పర్యటించారు. రెవెన్యూ డివిజన్ ఎత్తివేయడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, పోలవరం భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలపై రంపచోడవరం వెళ్లాలంటే దూరాభారంగా మారిందని ఇక్కడి ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చింతూరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీనిచ్చారు. ఈ మేరకు హామీని నెరవేరుస్తూ చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హర్షణీయం ప్రభుత్వం చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలగనుంది. – నాగులాపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్యే రంపచోడవరం ఇదీ చదవండి: అక్కా.. సాయం అందిందా? -
ఆలస్యం... అమృతం... విషం!
గణతంత్రదినోత్సవం నాడు రాష్ట్రంలో పరిపాలన, బౌగోళిక మార్పులకు శ్రీకారం చుడుతూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం. బ్రిటిష్ వారు 120 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిల్లాలకు అదనంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత నేటికి జనాభా 5 రెట్లు పెరిగినా కొత్త జిల్లాలు కేవలం రెండు (విజయనగరం, ప్రకాశం) మాత్రమే ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2021 జనగణనను కరోనా విపత్తు వల్ల నిరవధికంగా వాయిదా వేసి కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు మార్పు చేర్పులపై వున్న నిషేధాన్ని 2022 జూన్ 30 వరకు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ నూతన జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సరైన సమయంలో తీసుకున్న సాహసోపేత చర్య. జూన్ 30 నాటికి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, రెవెన్యూ గ్రామాల ఏర్పాటు, సరిహద్దుల్లో మార్పులు వంటివి పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు నివేదిస్తే జూలై తరువాత ఎప్పుడు జనగణన జరిగినా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రకారమే జనగణన చేపడతారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్‌లో ఎంతైనా వుంది. రాష్ట్రంలో సగటు జిల్లా జన సంఖ్య 37.98 లక్షలు కాగా మొత్తం జిల్లాలు 13 మాత్రమే. నూతనంగా ఏర్పడిన తెలం గాణలో జిల్లా సగటు జనాభా 11.35 లక్షలు ఉంటే జిల్లాలు 33 ఉన్నాయి. మనకన్నా జిల్లా సగటు జనాభా (26.64 లక్షలు) తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 80 జిల్లాలు ఉండటం గమ నార్హం. దేశంలో ఒక్క పశ్చిమ బెంగాల్లో (39.68 లక్షలు) మాత్రమే ఏపీలోని జిల్లా సగటు జనాభా కన్నా ఎక్కువ జన సంఖ్య ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని చూసిన ప్పుడు ఏపీలో జిల్లాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లు స్పష్ట మవుతున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇదీ ఒక కారణమే. దాదాపు పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దులే కొత్త జిల్లా సరిహద్దులకు ప్రాతిపదికగా తీసుకోవటం, అసెంబ్లీ నియోజక వర్గాలు రెండు మూడు జిల్లాల్లో విస్తరించకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మేలైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్‌లో 1974 జిల్లాల చట్టంలో ఉన్నవీ, 1984లో రూపొందించిన నిబంధనలనూ పరిశీలించినప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు గమనించాల్సిన ముఖ్యాంశాలు– ప్రాంతం, జనాభా, ఆదాయం... కొత్త, పాత జిల్లాల్లో దాదాపు సమపాళ్లలో ఉండేటట్లు తుది ముసాయిదా నాటికి సవరిం చాలి. అలాగే చారిత్రక నేపథ్యం, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు; సాంస్కృతిక పరమైన, విద్య, మౌలిక సదుపాయాలూ; ఆర్థిక పురోభివృద్ధి అవకాశాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన, లేదా బాగా వెనుకబడిన ప్రాంతాలు అన్నీ ఒకే దగ్గరకు రాకుండా చూడాలి. పార్లమెంట్ సరిహద్దు ప్రాతిపదికనే కాకుండా పరిస్థితిని బట్టి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయవలసి ఉంది. కొంతమంది 2026లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి... పార్లమెంటు సరిహద్దులు మారుతాయనీ, అందువల్ల ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు సరికాదనీ అంటున్నారు. ఇది వాస్తవం కాదు. 2001లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2026 తరువాత వచ్చే తొలి జనాభా లెక్కల ప్రకారం (అంటే 2031 సెన్సెస్) డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చేయ డానికి 3 సంవత్సరాలు పడుతుంది. అసలు జనాభా లెక్కల తుది జాబితానే 2034లో ప్రకటిస్తారన్న సంగతి గుర్తించాలి. అంటే 2039 ఎన్నికల వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య తేలే అవకాశమే లేదన్నమాట! కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు... ప్రత్యేకించి మెడికల్ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు, గ్రామీణా భివృద్ధి, పశువైద్యశాలలు, యువజన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు జిల్లాను యూని ట్‌గా తీసుకొని కేటాయింపులు చేస్తుంది. నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే... కొత్త జిల్లాలకు అదనపు నిధులు, మౌలిక సదుపాయాలకు హోం, డిజాస్టర్ శాఖల నుండి ప్రత్యేక నిధులు తెచ్చుకునే అవకాశం వుంటుంది. ఇంత ప్రయోజన కరమైన కొత్త జిల్లాల ఏర్పాటు ఎంత తొందరగా సాకారం అయితే అంతమంచిది. ‘ఆలస్యం అమృతం విషం!’ అందుకే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోనే ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై దృష్టి సారించింది. తద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు మరింత సమర్థవంతంగా, వేగంగా చేర్చడానికి వీలుండటమే కాక అభివృద్ధి ఊపందుకుంటుంది. ఇనగంటి రవికుమార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్: 94400 53047 -
పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: విజయ్ కుమార్
సాక్షి, విజయవాడ: కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయ్ కుమార్ గురువారం ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్ కుమార్ తెలిపారు. చదవండి: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు.. 63కు చేరిన మొత్తం.. పూర్తి వివరాలు ‘అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నాం. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధిలో ఉంది. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం ఆలోచించి రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పేరున్న ఇన్స్టిట్యూట్లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయి. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపాం. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాంను ఆ జిల్లాలో కలిపాం. విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశాం. పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాం ఉంది. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశాం. రంపచోడవరం అభివృద్ధి కోసమే అల్లూరి జిల్లాలో కలిపాం’ అని తెలిపారు. -
సీఎం జగన్ బర్త్‌డే: బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జీవో విడుదల..
సాక్షి, వైఎస్సార్ కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బద్వేలుకు సీఎం జగన్ కానుక అందించారు. బద్వేల్‌ను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధకు బద్వేలు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఏడాది జూలైలో బద్వేలు పర్యటనకు వచ్చిన సీఎం జగన్ బద్వేల్‌కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం బద్వేలను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ మంగళవారం జీవో విడుదల చేశారు. -
ఇక రిజర్వేషన్ల కుస్తీ..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పల్లె పోరుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాం గం అంతా బిజీ బిజీగా ఉంది. ఓటర్ల జాబితా మొదలుకొని కులగణన ప్రకియ వరకు వివిధ దశల్లో నిర్వహించాల్సి న కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇక రిజర్వేషన్ల ప్రక్రియపై కుస్తీ ప్రారంభించింది. గురువారం దీనిపై ప్రకటన విడుదలజేయనుంది. మరో వైపు అధికారులు పోలింగ్ స్టేషన్ల ఎంపిక ప్రకియపై దృష్టి సారించారు. అన్ని వసతులున్న కేంద్రాలను ఎంపిక చేయాలని కలెక్టర్ నుంచి అధికారులకు అదేశాలు అందడంతో గుర్తింపు ప్రకియ ప్రారంభమైంది. జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పంచాయతీల్లో 8910 వార్డులున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని షెడ్యూల్ ప్రకటించారు. ఈ మేరకు రెండు నెలల కిత్రం జరిగిన సార్వత్రిక ఎన్నికలఓటర్ల జాబితా ప్రామాణికంగా గ్రామ పంచాయతీని ఒక యూనిట్‌గా తీసుకొని ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. నిబంధనల మేరకు గ్రామ పంచాయతీలు, రద్దీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో 16,45,439 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మే 20 వరకు గ్రామంలో నివసిస్తున్న ఓటర్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటించారు. ఆత్మకూరు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట డివిజన్ల వారీగా ఉన్న పంచాయతీల్లోని వార్డుల్లో గల ఓటర్ల జాబితాలను ప్రకటించారు. ఈ ప్రకియ ముగిశాక కులగణనపై కసరత్తును నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగి కులగణన ప్రకియను చేపట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల గుర్తింపే కీలకంగా దీన్ని నిర్వహించారు. ఈ నెల మొదటి వారం వరకు దీన్ని నిర్వహించి తుది జాబితాతో ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలో కులగణనపై కొన్ని చోట్ల నిర్వహించిన గ్రామసభల్లో అభ్యంతరాలు రావడంతో మళ్లీ కసరత్తు చేశారు. అందిన డ్రాఫ్ట్ కాపీలు ఇందులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి డ్రాఫ్ట్ కాపీలు మంగళవారం అందాయి. బుధవారం పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కులగణన అధారంగా పంచాయతీల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గురువారం గ్రామాల వారీగా రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. దీనికి అనుగుణంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రకియపైనా అధికార గణం దృష్టి సారించింది. ప్రాథమికంగా ఒక్కో వార్డులో ఒక్కో బూత్ చొప్పున 8910 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గ్రీన్ సిగ్నల్ వస్తే మూడు దశల్లో ఎన్నికలు కులగణన పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే ఎన్నికల సంఘం రంగంలోకి దిగుతుంది. దీనికి అనుగుణంగా మండలం లేదా రెవెన్యూ డివిజన్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని సిద్ధం చేసే అవకాశం ఉంది. జిల్లా పంచాయతీ అధికారులు జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఇలా జరిగేందుకు అవకాశం.. మొదటగా కావలి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లలోని 19 మండలాల్లో గల 360 పంచాయతీల పరిధిలో 3406 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో గల 234 గ్రామ పంచాయతీల పరిధిలోని 2346 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని 15 మండలాల్లో 346 గ్రామ పంచాయతీల్లో 3158 వార్డుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. -
అద్దంకికి ఏం తక్కువ?
అద్దంకి:రెవెన్యూ డివిజన్ కావడానికి అన్ని అర్హతలున్న అద్దంకి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని పట్టణంతో పాటు, పరిసర మండలాల ప్రజలు కోరతున్నారు. గతంలో ప్రజా ప్రతినిధులు అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోకుండా, నేడు మార్టూరు, దర్శి రెవెన్యూ డివిజన్లు చేయబోతున్నామనే ప్రకటనలతో మరలా డివిజన్ విషయంలో ఆందోళనలు చేసేందుకు ప్రజలు, సంఘాలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే, రెవెన్యూ డివిజన్‌కు అన్ని అర్హతలున్న అద్దంకి పట్టణాన్ని డివిజన్‌గా ప్రకటించాలని పరిసర మండలాల ప్రజలు కోరుతున్నారు. గతంలో దీనిపై లక్ష పోస్ట్ కార్డు ఉద్యమం, రాస్తారోకోలు నిర్వహించారు. పరిసర పట్టణాలకుకేంద్ర బిందువుగా అద్దంకి.. పరిసర పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉన్న అద్దంకి. పురాతన కాలం నుంచి పరిపాలనకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ రాజుల కాలంలోనే రత్నాలు రాశులుగా పోసి విక్రయాలు జరిపినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రెడ్డి రాజుల మొదలుకుని, ఎందరో రాజులు పట్టణాన్ని రాజధానిగా చేసుకుని, కోట నిర్మాణంతో పరిపాలన సాగించారు. దీంతోపాటు నాటి నుంచి నేటి వరకూ వ్యవసాయ, వర్తక, వాణిజ్య, ఎగుమతులు, దిగుమతుల రంగంలో మంచి పేరు గడించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రస్తుతం కందుకూరు, మార్కాపురం, ఒంగోలు రెవెన్యూ డివిజన్లు ఉండగా, పరిపాలనా సౌలభ్యం కోసం, మరో రెండు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దీంతో జిల్లాలో ఐదు డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ప్రస్తుత డివిజన్ల పరిస్థితి.. జిల్లాలో 56 మండలాలు, 12 నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కాపురం, కందుకురు, ఒంగోలు డివిజన్లు, మరో రెండు డివిజన్లు ఏర్పాటైతే, ఒక్కో డివిజన్లో 11 మండలాల వంతున నాలుగు, 12 మండలాలతో ఒక డివిజన్ ఏర్పాటు అవుతాయి. మూడో శతాబ్దం నుంచే రాజకీయ కేంద్రం అద్దంకి క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచే రాజకీయ కేంద్రంగా, సైనిక స్థావరంగా ఉంది. రెడ్డి రాజుల రాజధాని మొదలు ఎన్నో రాజవంశాలు దీన్ని తమ రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాయి. 1200 ఏళ్ల నుంచి పట్టణంగా ... గుండ్లకమ్మ జీవ నది ఒడ్డున ఉన్న అద్దంకి, దాదాపు 1200 ఏళ్ల నుంచి పట్టణంగా ఉంది. గుర్తింపు ఇలా... 1955 నుంచి నియోజకవర్గ కేంద్రంగా ఉంది. 1950 నుంచి గ్రంథాలయం, 1950లోనే తాలూకా కేంద్రం ఏర్పాటైంది. 1870లో డిస్పెన్సరీ, ప్రస్తుతం అదే 30 పడకల అసుపత్రిగా అభివృద్ధి చెందింది. 1946 నుంచి హైస్కూల్, 1956లోనే ఎన్నెస్పీ ఈఈ కార్యాలయం, 1972 లో సబ్ జైలు, గతంలోనే ట్రజరీ, సబ్ రిష్ట్రార్ కార్యాలయం ఏర్పాటైంది. ఎక్కడా డిగ్రీ కళాశాల లేని రోజుల్లో అద్దంకిలో 1974లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. ఇంకా 6 జూనియర్ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక కళాశాల, రెండు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మరో జిల్లా పరిషత్ పాఠశాల, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలోనే పేరు గాంచిన ప్రముఖ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి పుణ్యక్షేత్రం ఉంది. పరిసర మండలాలకు కేంద్రంగా అద్దంకి... భౌగోళిక చారిత్రక అంశాలను బట్టి పరిశీలిస్తే కొత్తగా ఏర్పాటు చేయబోయో రెండు డివిజన్లలలో ఒక దాన్ని, పరిసర పట్టణాలకు కేంద్రంగా(మధ్యలో) ఉన్న అద్దంకిలో ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలతో పాటూ, వివిధ మండలాల ప్రజలు కోరుతున్నారు. డివిజన్ అయితే కలిసే మండలాలు.. అద్దంకి డివిజన్ ఏర్పాటు చేస్తే అద్దంకి, జె.పంగులూరు, ఇంకొల్లు, మార్టూరు, ముండ్లమూరు, సంతమాగులూరు, కొరిశపాడు, యద్దనపూడి, బల్లికురవ, పర్చూరు మండలాలను కలిపి ఏర్పాటు చేయవచ్చనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు. గతంలోనే అద్దంకి డివిజన్ ప్రతిపాదన.. 2014కు ముందు స్థానిక ప్రజా ప్రతినిధులు అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందుకు అవసరమైన ఫైల్‌ను తయారు చేసి కలెక్టరుకు, సీఎంకు పంపారు. ఈ క్రమంలో అప్పట్లో ఉన్న మూడు డివిజన్లే సరిపోతాయనే ఉన్నతాధికారుల నివేదికతో ఆగింది. ప్రస్తుతం మరో రెండు రెవెన్యూ డివిజన్ల ప్రకటనతో అద్దంకి పరిసర మండలాల ప్రజలు, అద్దంకినే డివిజన్ చేయాలని కోరుతున్నారు. పోస్ట్ కార్డు ఉద్యమం, ధర్నాలు.. మునిసిపాలిటీగా అద్దంకి అవతరించడం, బల్లికురవ గ్రానైట్ ద్వారా, ప్రపంచ వ్యాప్త వ్యాపారం, వ్యవసాయు ఉత్పత్తుల దిగుబడి, వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతుల రంగంలో, ఆదాయ వనరులను కలిగిన అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ పట్టణ అభివృద్ధి కమిటీ ఇటీవల అద్దంకి –నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అదే విధంగా లక్ష పోస్ట్‌కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. వీటిని త్వరలో సీఎం చంద్రబాబు నాయుని వద్దకు చేర్చబోతున్నారు. ఈ క్రమంలో ఇన్ని వసతులున్న అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా చేయాలని రాజకీయ నాయుకులు, పరిసర మండలాల ప్రజలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయాలి అద్దంకిరూరల్: చరిత్ర ఉన్న అద్దంకిను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్రమ శిక్షణ సంఘ సభ్యుడు జ్యోతి హనుమంతరావు అన్నారు. అద్దంకి– నార్కేట్పల్లి రాష్ట్రీయ రహదారిని పట్టణంలో విస్తరణను సక్రమంగా జరగాలని కోరుతూ పట్టణ అభివృద్ధి కమిటీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బంగ్లారోడ్‌లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసమే దర్శి, మార్టూరులను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్. సీతారామాంజనేయులు మాట్లాడుతూ ఎంతో చారిత్రక చరిత్ర కలిగిన అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వర్లు, పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారం లభించే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. తొలిరోజు దీక్షలను జ్యోతి చంద్రమౌళి పూలమాలలు వేసి ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, సీపీఐ సీనియర్ నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వర్లు, డేవిడ్, వడ్లపల్లి ఆంజనేయులు, పవన్‌కుమార్ దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో నాగినేని రామకృష్ణ, యు. దేవపాలన, యర్రమోతు నాగేశ్వరరావు, చలమారెడ్డి పాల్గొన్నారు. -
జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
జహీరాబాద్: జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటిని 26వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలలో గోవింద్పూర్ గ్రామ సర్పంచ్ బి.రాజు, పార్టీ నాయకులు ఎస్.నారాయణ, జి.అంజన్న, ఎస్.హన్మంతు, పి.నారాయణ, కృష్ణారెడ్డికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి వై.నరోత్తం సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు డాక్టర్ చంద్రశేఖర్, జలాలుద్దీన్, సుధీర్ భండారి, రాచప్ప, నేత్రయ్య, జగన్మోçßæన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మల్లయ్యస్వామి, రాంచంద్రారెడ్డి, టి.రాములు, మాజీద్, ఆర్.రాజు, వీర్శెట్టి, ఎన్.జి.నర్సింహులు, ఓంప్రకాష్, జగన్, అంజయ్య, జనార్ధన్‌రెడ్డి, టి.శివన్న, బి.రాములు, వెంకట్లు పాల్గొన్నారు.