Planning Department
-
7 పేజీలు.. 54 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన కోసం ప్రణాళిక శాఖ ప్రత్యేక ఫార్మాట్ తయారు చేసింది. మొత్తం 7 పేజీలలో 54 ప్రశ్నలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సమగ్ర సమాచారాన్ని సేకరించేలా దీనిని రూపొందించింది. వ్యక్తిగత వివరాలే కాకుండా ఆస్తులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు వంటి ఇతర వివరాలను కూడా సేకరించే విధంగా సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రతి జిల్లా, మండలం, గ్రామం, మున్సిపాలిటీ, వార్డు నంబరు, ఇంటి నంబర్లకు ప్రత్యేక కోడ్ ఇవ్వడం ద్వారా.. ఈ సమాచారాన్ని నమోదు చేసేలా ప్రణాళిక శాఖ ఏర్పాట్లు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కులగణన ఫార్మాట్లో ఉన్న ప్రశ్నలివే..పార్ట్ –1క్రమసంఖ్య, కుటుంబ యజమాని–సభ్యుల పే ర్లు, యజమానితో సంబంధం, జెండర్, మతం, కులం/సామాజిక వర్గం, ఉప కులం, ఉప కులం యొక్క ఇతర పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్ నంబర్.పార్ట్ –2ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కార్డు, దివ్యాంగులైతే వైకల్య రకం, వైవాహిక స్థితి, వివాహ కాలం నాటికి వయసు, ఆరేళ్ల వయసులోపు పాఠశాలలో చేరారా లేదా?, పాఠశాల రకం, విద్యార్హతలు, 6–16 ఏళ్ల మధ్య వయసువారు బడి మానేస్తే ఆ సమయానికి చదువుతున్న తరగతి, వయసు, బడి మానేయటానికి గల కారణాలు, 17–40 ఏళ్లలోపు వారు విద్యను కొనసాగించకపోవడానికి గల కారణాలు, నిరక్షరాస్యులైతే చదువుకోకపోవడానికి గల కారణాలు.పార్ట్–3ప్రస్తుతం ఏదైనా పనిచేస్తున్నారా?, చేస్తుంటే ఆ వృత్తి, స్వయం ఉపాధి అయితే సంబంధిత వివరాలు, రోజువారీ వేతన జీవులైతే ఏ రంగంలో పనిచేస్తున్నారు?, కులవృత్తి, ప్రస్తుతం కులవృత్తిలో కొనసాగుతున్నారా లేదా?, కులవృత్తి కారణంగా ఏమైనా వ్యాధులు సంక్రమించాయా?, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపుదారులా?, బ్యాంకు ఖాతా ఉందా లేదా?పార్ట్–4రిజర్వేషన్ల వల్ల పొందిన విద్య ప్రయోజనాలు, ఉ ద్యోగ ప్రయోజనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రం పొందారా?, సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందిన వారా?, రాజకీయ నేపథ్యం ఏమిటి?, ప్ర జాప్రతినిధిగా ఉంటే ప్రస్తుత పదవి ఏమిటి?, ఎన్ని సార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు?, మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?, నామినేటెడ్/ కార్పొరేష న్/ ప్రభుత్వ సంస్థలు వేటిలోనైనా సభ్యులా?పార్ట్–5ధరణి పాస్‌బుక్ ఉందా, లేదా?, ఉంటే పాస్‌బుక్ నంబర్, భూమిరకం, విస్తీర్ణం, వారసత్వమా?, కొన్నదా?, బహుమానమా?, అసైన్డ్ భూమా?, అటవీ హక్కుల ద్వారా పొందినదా?, ప్రధాన నీటి వనరు, పండే పంటలు, ఏమైనా రుణాలు తీసుకున్నారా?, ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు?, ఎక్కడి నుంచి తీసుకున్నారు?, వ్యవసాయ అనుబంధంగా ఏదైనా పనిచేస్తారా?, కుటుంబానికి చెందిన పశుసంపద (ఆవులు, ఎడ్లు, గేదెలు, మేకలు, కోళ్లు, బాతులు, పందులు, ఇతరాలు) వివరాలు.పార్ట్–6కుటుంబ స్థిరాస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య, చరాస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాస గృహం రకం, స్వభావం, మరుగుదొడ్డి ఉందా/లేదా?, ఉంటే వాడుతున్నారా? వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం, ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా? -
కులగణనకు నాంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనకు బుధవారం నాంది పలకనుంది. రాష్ట్రంలో ఐదు సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా కుల గణన చేపట్టనుంది. బుధ, గురువారాల్లో రెండు రోజులు గ్రామీణ ప్రాంతాల్లో మూడు గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో రెండు వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంబంధిత జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడానికి ఈ నెల 3న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కుల గణన ముందస్తు షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి ఎం. గిరిజా శంకర్ ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్న వివిధ శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేస్తూ యూవో నోట్ విడుదల చేశారు. ముందస్తుగా ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో అవసరమైతే మార్పులు చేసి, పూర్తిస్థాయిలో కులగణన చేపట్టనున్నట్లు సమాచారం. సిబ్బందికి శిక్షణ రాష్ట్రవ్యాప్తంగా కుల గణనలో ఎన్యూమరేటర్లుగా వ్యవహరించే సచివాలయాల సిబ్బందితో పాటు సూపర్వైజర్లు, మండల, మున్సిపల్ స్థాయి అధికారులు, పర్యవేక్షణ చేసే జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు మూడు విడతల్లో ఈ నెల 22 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్వంలో మంగళ, లేదా బుధవారం శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రేపటి నుంచే రౌండ్ టేబుల్ సమావేశాలు కుల గణనపై ప్రభుత్వం బుధవారం నుంచి జిల్లాలవారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనుంది. బుధ, గురువారాల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత భాగస్వామ్యులతో ఈ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత ఐదు ప్రాంతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో, 20న విశాఖ, విజయవాడలో, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రాంతీయ సదస్సులు జరిగే ఐదు జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లా స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశాలు ఉండవని రాష్ట్ర ప్రణాళిక శాఖ స్పష్టం చేసింది. -
AP: డిసెంబర్ నాటికి రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047
సాక్షి, అమరావతి: వికసిత్ భారత్–2047లో భాగంగా నీతి ఆయోగ్ సహకారంతో రాష్ట్ర ను డిసెంబర్ నెలాఖరుకల్లా సిద్ధం చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల వృద్ధికి ఆయా శాఖలవారీగా దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్ర అధికారులకు అందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం వర్క్‌షాప్ ప్రారంభమైంది. మూడు రోజులపాటు దీన్ని నిర్వహిస్తారు. తొలి రోజు వర్క్‌షాప్ నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్–2047 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దీని ద్వారా ప్రజలకు సాధికారత కల్పించడంతో పాటు ఆధునిక భారతదేశ నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులను కేంద్రం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పురోగతిపైనే కాకుండా ప్రాంతీయ ఆకాంక్షలపైన కూడా దృష్టి సారించిందన్నారు. అందుకనుగుణంగా రాష్ట్ర విజన్ ప్రణాళిక – 2047ను రూపొందించేందుకు రాష్ట్ర అధికారులకు అవసరమైన శిక్షణను నీతి ఆయోగ్ అందిస్తోందని చెప్పారు. దీన్ని రాష్ట్ర అధికారులు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర విజన్ ప్రణాళికను సమగ్రంగా సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని కోరారు. వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు కాగా తొలి రోజు వర్క్‌షాప్‌లో ఉదయం సామాజిక రంగం, మధ్యాహ్నం ప్రాథమిక రంగానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఆయా రంగాల వారీగా బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లను ఆయా శాఖల అధికారులు నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో హరీందిర ప్రసాద్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.నరసింహం తదితరులతోపాటు నీతి ఆయోగ్ సలహాదారు సీహెచ్ పార్థసారధి రెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సల్టెంట్ శైలీ మణికర్, పర్యవేక్షణ – మూల్యాంకన నిపుణులు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ డైరెక్టర్ అంకష్ వథేరా తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలను రూపొందిస్తున్నాం.. రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్–2047 కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల్లో వ్యూహాత్మక వృద్ధిని సాధించేందుకు అవసరమైన దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక రంగంలో.. వ్యవసాయం, పశుసంవర్థకం, డెయిరీ, ఫిషరీస్, ఉద్యానవనం, సెరికల్చర్, మార్కెటింగ్, సహకారం, అటవీ, జలవనరులు, భూగర్భ జలాలు, చిన్ననీటి పారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి వంటి అంశాల్లో దృక్కోణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ద్వితీయ రంగంలో.. ఇంధనం, రవాణా, ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, ఆహార శుద్ధి, గనుల తవ్వకం, చేనేత–జౌళి, గృహ నిర్మాణం, టిడ్కో తదితర అంశాలపైన సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. సామాజిక రంగం అభివృద్ధిలో భాగంగా విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, పౌర సరఫరాలకు సంబంధించిన అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. -
చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌కు ప్రణాళిక శాఖ మెమో జారీ
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు ఏపీ ప్రణాళిక శాఖ మెమో జారీ చేసింది. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అనుమతి లేకుండా విదేశాలకు పారిపోవడంపై వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ప్రణాళిక శాఖ మెమో ఇచ్చింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో విచారించేందుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగానే పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారయ్యాడు. అనుమతి లేకుండానే అమెరికా చెక్కేశాడు. అయితే స్కిల్ డెవెలప్మెంట్ స్కాంలో శ్రీనివాస్‌ను కీలక వ్యక్తిగా సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవెలప్మెంట్ స్కాం వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారపోయిన విషయం తెలిసిందే. నోటీసుల గురించి తెలుసుకున్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లినట్లు అధికారులు గుర్తించగా..పలు కాంట్రాక్టుల్లో షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ కూడా సెప్టెంబర్ 5న దేశం విడిచి దుబాయ్ వెళ్లారు. యోగేష్ గుప్తాతో చంద్రబాబు పీఎస్‌కు సంబంధాలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి చివరకు నగదు రూపంలో మార్చడంలో షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించినట్టు అడిషనల్ డీజీ సంజయ్ ఇప్పటికే తెలిపారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తాలకు ఆర్థిక అంశాల్లో సంబంధాలున్నట్టు గతంలో ఐటీ దాడుల్లో వెల్లడైంది. పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్గుప్తాలు కలిసి ఈ మొత్తం వ్యవహారం నడిపారు. ప్రభుత్వ సొమ్మును మళ్లించడం, తిరిగి షెల్ కంపెనీల ద్వారా వాటిని ఒకే వ్యక్తి పొందారనడానికి పూర్తి ఆధారాలున్నాయని ఇప్పటికే ఐటీ నోటీసుల ద్వారా వెల్లడయింది అరెస్ట్ సందర్భంగా చంద్రబాబుకు వాట్సాప్ స్క్రీన్షాట్లు 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు, ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తో జరిగిన వాట్సాప్ చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసు అధికారులు ఇటీవల చంద్రబాబుకు చూపించారు. ఇవి చూపించగా.. తనకేం తెలియదని, అసలు గుర్తు లేదంటూ బాబు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. చదవండి: రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి -
జిల్లాల స్థూల ఉత్పత్తిలో ‘కృష్ణా’ ఫస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల స్థూల ఉత్పత్తిలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కృష్ణాజిల్లా మొదటి ర్యాంకు సాధించింది. విశాఖపట్నం జిల్లా రెండో ర్యాంకులో ఉండగా తూర్పుగోదావరి జిల్లా మూడవ స్థానంలో ఉంది. విజయనగరం జిల్లా చివరి 13వ ర్యాంకులో నిలిచింది. జిల్లాల స్థూల ఉత్పత్తికి (ఆదాయాల) సంబంధించిన గణాంకాలను ప్రణాళికా శాఖ ఇటీవల రూపొందించింది. జిల్లాల ఆదాయ సూచికలు సమతుల్య అభివృద్ధి సాధనకు దోహదపడతాయని ప్రణాళికా శాఖ పేర్కొంది. అలాగే, జిల్లాల మధ్య అసమానతనలు పరిశీలించడంతో పాటు ఆయా జిల్లాల అభివృద్ధికి సరైన ప్రణాళికలు రూపొందించడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయని ప్రణాళికా శాఖ నివేదికలో వివరించింది. జిల్లాల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరును అంచనా వేయడానికి కూడా ఈ స్థూల ఉత్పత్తి గణాంకాలు అవసరమని ప్రణాళికా శాఖ తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ.. మరోవైపు.. ప్రస్తుత ధరల ప్రకారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14.64 శాతంతో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా 14.22 శాతంతో రెండో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లా 10.00 శాతంతో మూడోస్థానంలో ఉంది. అలాగే, పారిశ్రామిక రంగంలో విశాఖ జిల్లా 18.43 శాతంతో మొదటి ర్యాంకులో, 13.82 శాతంతో తూర్పుగోదావరి జిల్లా రెండవ ర్యాంకులో ఉండగా చిత్తూరు జిల్లా 9.33 శాతంతో మూడవ ర్యాంకులో ఉంది. ఇక సేవా రంగంలో 15.69 శాతంతో విశాఖ జిల్లా మొదటి ర్యాంకులో ఉంది. కృష్ణాజిల్లా 14.98 శాతంతో రెండో ర్యాంకులో ఉండగా.. తూర్పుగోదావరిజిల్లా 9.51 శాతంతో మూడో స్థానంలో ఉంది. -
ఏపీ వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది: విజయ్‌కుమార్
-
శరవేగంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ
-
పేర్లు, జిల్లా కేంద్రాలపైనే ప్రధానంగా సూచనలు
సాక్షి, అమరావతి: నూతన జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు 7,500 ప్రజాభిప్రాయాలు అందగా జిల్లా కేంద్రాలు, జిల్లాల పేర్లపైనే ఎక్కువ సూచనలు వచ్చాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా నుంచి 4,500కిపైగా అభిప్రాయాలు వచ్చాయి. అందులో ఒక అంశంపైనే 4 వేలకుపైగా ఉండడం గమనార్హం. సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం ప్రస్తుతం విజయనగరంలో ఉండగా పునర్వ్యవస్థీకరణలో దాన్ని పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో ప్రతిపాదించారు. పార్వతీపురం తమకు బాగా దూరమవుతుంది కాబట్టి విజయనగరంలోనే ఉంచాలనే అభిప్రాయాలు పెద్దఎత్తున వచ్చాయి. ఎస్ కోట నియోజకవర్గం కొత్తవలస మండలాన్ని విజయనగరంలో కాకుండా విశాఖలో కలపాలని కొన్ని సూచనలు వచ్చాయి. పార్వతీపురం జిల్లాకు మన్యం జిల్లాగా పేరు పెట్టడంపైనా ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. మన్యం అంటే ఏజెన్సీ ప్రాంతంగా మారుతుందని, దానివల్ల 1/77 చట్టం పరిధిలోకి వెళ్లిపోయి భూముల క్రయ విక్రయాలకు ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మన్యం అని కాకుండా పార్వతీపురం పేరుతో కొనసాగించాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లాలో పేర్లు అటు ఇటు మార్చాలని.. కృష్ణా జిల్లాలో 2,900 అభ్యంతరాలు రాగా జిల్లా కేంద్రాల పేర్లు మార్చాలనే సూచనలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాను వంగవీటి జిల్లా, కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా చేయాలని సూచనలు అందాయి. మైలవరం డివిజన్ ఏర్పాటు చేయాలని 2 వేల వరకు సూచనలు వచ్చాయి. టీడీపీ నేత దేవినేని ఉమా నేతృత్వంలో రాజకీయ కోణంలో వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలను కోనసీమ జిల్లాలో కలపవద్దని, రాజమండ్రి లేదా కాకినాడలో కలపాలనే సూచనలు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, ఎటపాకలను పాడేరులో కాకుండా రాజమండ్రిలోనే ఉంచాలని, లేదంటే ప్రత్యేక జిల్లాగా చేయాలని పలు అభిప్రాయాలు అందాయి. విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా విశాఖలోనే ఉంచాలనే సూచనలు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. విజయనగరంలో జామి, శ్రీకాకుళంలో పాతపట్నం మండలాలను ఇప్పుడున్న డివిజన్లో కాకుండా వేరే డివిజన్‌లోకి మార్చాలనే సూచనలు వచ్చాయి. జిల్లా కేంద్రాలపై మూడు చోట్ల అభ్యంతరాలు.. జిల్లా కేంద్రాలుగా అనంతపురం జిల్లాలో హిందూపురం, వైఎస్సార్ కడపలో రాజంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పట్టణాలను చేయాలని సూచనలు వచ్చాయి. భీమవరం, రాయచోటి, పుట్టపర్తిని వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు అందాయి. ద్వారకా తిరుమల మండలాన్ని రాజమండ్రిలో కాకుండా ఏలూరు జిల్లాలో కలపాలని భారీగా సూచనలు వచ్చాయి. కోనసీమకు అంబేడ్కర్, కర్నూలుకు దామోదరం సంజీవయ్య, కృష్ణాకు పింగళి వెంకయ్య, ఏలూరుకు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేర్లు పెట్టాలనే సూచనలూ అందాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చిరంజీవి జిల్లాగా పేరు పెట్టాలని కొన్ని సూచనలు అందడం విశేషం. ఐదు కేటగిరీలుగా.. సూచనలు, అభ్యంతరాలను ఐదు కేటగిరీలుగా విభజించి పరిశీలిస్తున్నారు. డివిజన్ కేంద్రం మార్పు, జిల్లా కేంద్రం మార్పు, కొత్త డివిజన్ ఏర్పాటు, ఆ డివిజన్లో కాకుండా మరో డివిజన్‌లోకి మార్చడం, నియోజకవర్గాల్లోని మండలాలను విభజించడం... ఇలా 5 విభాగాలుగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను విభజించారు. 9 జిల్లాల్లో ముగిసిన గడువు.. సూచనలు, అభ్యంతరాల స్వీకరణ గడువు దాదాపు ముగింపు దశకు వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 30 రోజులు అభ్యంతరాలకు గడువు ఇవ్వగా ఫిబ్రవరి 24వ తేదీకే 9 జిల్లాల్లో గడువు ముగిసింది. ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ నెల 3వ తేదీ వరకు, అనంతపురం జిల్లాలో 5వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే సూచనలు, అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ల కమిటీ ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి అధ్యయనం జరిపి ఒక అభిప్రాయానికి వచ్చింది. వచ్చిన వినతులన్నింటినీ క్రోడీకరించి తమ సిఫారసులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి గడువు ముగిసిన వారం రోజుల్లో సమర్పించనుంది. అనంతరం ప్రభుత్వ స్థాయిలో వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త జిల్లాలకు ప్రజామోదం ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ కొత్త జిల్లాల ప్రతిపాదనలను ప్రజలు ఆమోదించినట్లు తమ అధ్యయనంలో కనిపించిందని ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ చెప్పారు. విజయవాడలోని ప్రణాళికా శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపై అధ్యయనం జరిపి క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించామని తెలిపారు. అభ్యంతరాలు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా కేవలం 60 అంశాలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు అందినట్లు గుర్తించామన్నారు. జనాభా, ఏరియా సైజును బట్టి కొన్ని కలపడం, మార్చడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అని ముందే తాము ఆలోచించామని, అలాంటి చోట్లే అభ్యంతరాలు, సూచనలు వచ్చాయన్నారు. పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకోగా దాని చుట్టూ ఉన్న నియోజకవర్గాలను రెండో లెవల్‌గా, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా అలాగే ఉంచాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండాలనే నియమాల ఆధారంగా చేసిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. సూచనలపై కలెక్టర్ల నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మార్చి ఆఖరి వారంలో తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి ఆర్డర్ టు సర్వ్ ఇస్తారని చెప్పారు. కొత్తగా నియమించే కలెక్టర్లను ముందుగా ఓఎస్డీలుగా నియమించి ఆ తర్వాత నోటిఫైడ్ తేదీ నాటికి కలెక్టర్లుగా మారేలా ఆదేశాలు ఇస్తారని తెలిపారు. -
హెచ్ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం దళారులు, మధ్యవర్తులకు అడ్డాగా వరింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మధ్యేమార్గంలో అధికారులను సంప్రదించాల్సిందే. లేదంటే ఫైళ్లు పెండింగ్ జాబితాలో పడిపోతాయి. నెలల తరబడి పడిగాపులు కాసినా అనుమతులు లభించవు. భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులు తదితర అన్ని రకాల పనుల్లో దళారుల దందానే నడుస్తోంది. ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసి టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించినా సకాలంలో అనుమతులు లభించడం లేదు. దీంతో గత్యంతరం లేక మధ్యవర్తులను ఆశ్రయించాల్సివస్తోందని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులకు వెళితే రకరకాల కొర్రీలు పెట్టి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వందలాది ఫైళ్లు పెండింగ్ జాబితాలో చేరిపోతున్నాయి. ఈ క్రమంలో ‘మధ్యేమార్గంగా’ సంప్రదించి చేయి తడిపితే ఫైళ్లు చకచకా ముందుకు కదులుతున్నాయని భవన నిర్మాణదారులు, రియల్డర్లు చెబుతున్నారు. కొర్రీలు ఇలా.. ► హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో సవరించిన విధంగానే వెంచర్‌కు సన్నాహాలు చేసుకొని డాక్యుమెంట్లు సమర్పించినా ఏదో ఓ లోపాన్ని ఎత్తి చూపుతారు. రోడ్డు వెడల్పు తక్కువగా ఉందని, వెంచర్లో పార్కులు, గ్రీనరీ సూచించిన విధంగా లేదని అనుమతులను నిలిపివేస్తారు. ► నిబంధనలను అనుగుణంగా డాక్యుమెంట్లను అప్లోడ్ చేసినప్పటికీ ఏదో ఒకవిధంగా కాలయాపన చేస్తే సదరు నిర్మాణదారు నేరుగా కాని, మధ్యవర్తి ద్వారా కాని కలిసేలా ఒత్తిడి తెస్తారు. దీంతో లేఅవుట్ పర్మిషన్లు, భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటోంది. ► ఇలాంటి జాప్యానికే కారణమైన ముగ్గురు అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు, ఓ తహసీల్దారుపై హెచ్ఎండీఏ కమిషనర్ పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే వాళ్లు ఫైళ్లను పక్కన పెట్టినట్లు కమిషనర్ గుర్తించారు. రోజుకు 100కు పైగా ఫైళ్లు.. ► హెచ్ఎండీఏ పరిధిలోని శంషాబాద్, శంకర్పల్లి, ఘట్కేసర్, మేడ్చల్ జోన్ల పరిధిలో రియల్ బూమ్ జోరుగా సాగుతోంది. ఇటు దుండిగల్, శంకర్పల్లి నుంచి అటు చౌటుప్పల్, భువనగిరి తదితర ప్రాంతాల వరకు లే అవుట్ పర్మిషన్ల కోసం రోజుకు 100కు పైగా ఆన్లైన్ దరఖాస్తులు వస్తున్నాయి. ► సాధారణంగా ఈ ఫైళ్లను పరిశీలించి నిబంధనల మేరకు ఫీజులు తీసుకొని అనుమతులు ఇచ్చేందుకు వారం రోజులు సరిపోతుంది. ఉద్దేశ్యపూర్వకంగా ఫైళ్లను పక్కన పెట్టడంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నట్లు రియల్టర్లు ఆరోపిస్తున్నారు. ► మధ్యేమార్గంగా అధికారులను ప్రసన్నం చేసుకుంటే మాత్రం క్షణాల్లో అనుమతులు వస్తాయి. ఇందుకోసం ఎకరానికి రూ.లక్ష వరకు సమర్పించుకోవాల్సివస్తోందని ఓ మధ్యవర్తి తెలిపారు. ‘పది ఎకరాల లోపు వెంచర్లైతే కిందిస్థాయి అధికారులతోనే పని పూర్తి చేసుకోవచ్చు. భారీ ప్రాజెక్టులకు మాత్రం ఉన్నతాధికారులను సంప్రదించాల్సి ఉంటుంది’ అని వివరించారు. పెరిగిన పని భారం... ► రియల్ ఎస్టేట్ బూమ్‌ను సొమ్ము చేసుకొనేందుకు కొందరు అధికారులు అక్రమాలకు తెర తీయడంతోనే కాకుండా ఒకరిద్దరు అధికారులపై పెరిగిన పని భారంతో కూడా ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ► శంకర్పల్లి, శంషాబాద్, ఘట్కేసర్ జోన్లకు మూడింటికీ ఒక్క అధికారే ఉన్నారు. పైగా అదనపు బాధ్యతలు కూడా ఉండడంతో పని భారం పెరుగుతోంది. ల్యాండ్ సర్వేయరు సైతం ఒక్కరే ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో పనుల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటున్నట్లు నిర్మాణదారులు, రియల్టర్లు చెబుతున్నారు. -
నెల్లూరు జిల్లా మినహా.. 'పునర్విభజన' అభ్యంతరాల స్వీకరణ పూర్తి
సాక్షి, విశాఖపట్నం: పునర్విభజనకు సంబంధించి నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను పూర్తిచేశామని జిల్లాల పునర్విభజన కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. మార్చి 3న ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేసి అదే రోజు మొత్తం నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విశాఖ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరితో కలిపి నాలుగు జిల్లాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఆయన పరిశీలించారు. ఈ జిల్లాల కలెక్టర్లతో పాటు రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్ధ్ జైన్‌తో కలిసి వాటిని స్క్రూటినీ చేశారు. అనంతరం విజయకుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం మేరకే జిల్లాల విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతోందని స్పష్టంచేశారు. ఈ ప్రక్రియ తర్వాత రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో సగటున 18 నుంచి 20 లక్షల జనాభా ఉంటుందన్నారు. దీంతో పరిపాలన సౌలభ్యం కలగడంతోపాటు మారుమూల గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలపై చర్చించామని ఆయన చెప్పారు. వీటి నుంచి మొత్తం 4,590 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే 4,000 వచ్చాయన్నారు. విజయనగరం 40, విశాఖపట్నం 250, తూర్పు గోదావరి జిల్లా నుంచి 300 అభ్యంతరాలు వచ్చాయని విజయకుమార్ చెప్పారు. ఇక కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో 90 శాతం కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటుచేసేలా చర్యలు చేపడుతున్నామని.. అవిలేని చోట ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. నాలుగు జిల్లాల్లో ప్రధాన అభ్యంతరాలివే.. ఇక ఈ 4 జిల్లాల్లో గుర్తించిన ప్రధాన అభ్యంతరాలను విజయకుమార్ వివరించారు. అవేమిటంటే.. ► తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాకుండా రాజమండ్రి జిల్లాలోనే చేర్చాలి. ► అమలాపురం జిల్లాలో ఉండే మండపేట, జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలాన్ని రాజమండ్రిలోనే కొనసాగించాలి. ► అలాగే, విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలి. ► పార్వతీపురం పేరును జిల్లాగా ఉంచాలి. ► పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలి. ► అనకాపల్లి జిల్లాకు నర్సీపట్నం కేంద్రం చేయాలి. ఈ కార్యక్రమంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు డాక్టర్ మల్లికార్జున, సి. హరికిరణ్, ఎ. సూర్యకుమారి, శ్రీకేష్ లాఠకర్‌లు పాల్గొన్నారు. జనగణనకు ఇబ్బంది ఉండదు 2020–21లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా జరగలేదని విజయకుమార్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ నెలాఖరు నాటికి జిల్లా సరిహద్దులను మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చని చెప్పారని.. కానీ, అంతకన్నా ముందే ఏప్రిల్ 2 నాటికే ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తికానుందన్నారు. కాబట్టి జనగణనకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నారు. -
కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు ఏ ప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. శనివారం ఆయన సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ జైన్‌తో కలిసి అనంతపురం కలెక్టరేట్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, వైఎస్సార్ జిల్లా జాయిం ట్ కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలను పరిశీ లించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్చి 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరా లు, సలహాలు తీసుకుంటామని తెలిపారు. వీటిపై కలెక్టరు నివేదిక పంపుతారన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్ష ల మేరకే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కొత్త జిల్లాలన్నింటిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. రాయలసీమలో కొత్త జిల్లాలపై 1,600కు పైగా అ భ్యంతరాలు వచ్చాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పెనుకొండ గానీ, హిందూపురం గానీ పెట్టాలన్న భావన వ్యక్తమైందన్నారు. ఈ అంశం పరిశీలనలో ఉందన్నారు. రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్లో కలపాలని, కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో ఉంచమని కోరుతున్నారన్నారు. మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ కొన్ని దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రధానంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న డిమాండ్ వచ్చిందని చెప్పారు. నగరిని తిరుపతిలో ఉంచాలని అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి అంశం పూర్వాపరాలు, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. -
AP: కీలక దశకు కొత్త జిల్లాల ఏర్పాటు.. ఏప్రిల్ 2 నుంచి పాలన
సాక్షి, అనంతపురం: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుందని.. మార్చి 3 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని.. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని పేర్కొన్నారు. AP: సమయానికి రాకపోతే ‘సెలవే’ ఆర్డర్ టూ వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని విజయ్‌కుమార్ తెలిపారు. అనంతపురంలో పర్యటించిన ఉన్నతస్థాయి కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటు కీలక దశకు చేరింది. ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ శనివారం అనంతపురంలో పర్యటించింది. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారుల బృందం భేటీ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలకు సంబంధించిన వివరాలు.. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయాలపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లు నివేదికలను అందజేశారు. -
కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలకు మౌలిక వసతులపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోందని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు, సూచనల పరిశీలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో బుధవారం విజయవాడలో సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ తరపున సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్, జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై చర్చించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వాటిలో సహేతుకంగా ఉన్నవి, వాటి అవసరం వంటి అంశాలను పరిశీలిస్తామన్నారు. వీటిపై మార్చి 10 లోపు కలెక్టర్లు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి తెలుపుతారని, ఆ తర్వాత తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 1,400 వరకు అభ్యంతరాలు, సూచనలు వచ్చాయని, ఒకే విషయానికి సంబంధించి ఎక్కువ వచ్చాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలని, నర్సాపురాన్ని జిల్లాగా ఉంచాలని కోరుతూ ఎక్కువ సూచనలు వచ్చాయని తెలిపారు. పేర్లు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల గురించి ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయన్నారు. సహేతుక కారణాలుంటే రెవెన్యూ డివిజన్లను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. ప్రత్యేక డిజైన్‌తో 3 నుంచి 4 లక్షల చదరపు అడుగుల్లో వీటిని నిర్మించాలని చెప్పారన్నారు. వీటి కోసం ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్‌ను నియమించాలని సీఎం సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం కార్యాలయాలకు దాదాపు అన్ని జిల్లాల్లో భవనాలు గుర్తించామన్నారు. ప్రభుత్వ భవనాలు, భూముల్లోనే కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతాయన్నారు. తప్పనిసరైతేనే ప్రైవేటు భవనాలు చూస్తున్నామన్నారు. -
ప్రతి సూచనా పరిగణనలోకి..
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలపై అందే ప్రతి సూచన, అభ్యంతరాన్ని పరిశీలిస్తామని ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చామని, ఎవరైనా తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలను జిల్లా కలెక్టర్లకు తెలియచేయవచ్చన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుపై ఆదివారం ఆయన విజయవాడలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రతి అంశాన్ని ఎంతవరకు ఆమోదయోగ్యం? ప్రజలకు ఏమేరకు ఉపయోగకరంగా ఉంటుంది? అనే కోణంలో పరిశీలిస్తామన్నారు. ప్రణాళికా శాఖ, సీసీఎల్ఏ కార్యదర్శి, కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. అక్కడ వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. సుహృద్భావ వాతావరణంలో.. జిల్లాల విభజనను సుహృద్భావ వాతావరణంలో, ప్రజాస్వామ్యయుతంగా చేపట్టాలన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మార్చి మూడో వారంలో తుది నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం సూచించినట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతులకు సంబంధించి తొలుత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాటిపై దృష్టి పెడతామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయాలతో కలిపి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలనే అంశం సీఎం పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. జిల్లాల ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన జరగడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. -
అధ్యయనం.. ఆకాంక్షలు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలను క్షుణ్నంగా అధ్యయనం చేసి పూర్తి శాస్త్రీయంగా రూపొందించినట్లు ప్రణాళికాశాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై జరిగిన సుదీర్ఘ కసరత్తును గురువారం ఆయన విజయవాడలోని ప్రణాళికా శాఖ కార్యాలయంలో విలేకరులకు తెలియచేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాలు ఏర్పాటు చేస్తూ జిల్లా కేంద్రాలు అందరికీ సమీపంలో ఉండేలా ప్రతిపాదించినట్లు తెలిపారు. మన్యం అభివృద్ధికి రెండు జిల్లాలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ప్రతిపాదించినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచనల ప్రకారం రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. మన్యం ప్రజల అభివృద్ధికి రెండు జిల్లాలు దోహదం చేస్తాయన్నారు. పార్వతీపురం జిల్లా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో ఏర్పాటవుతుంది. అరకు జిల్లా అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం ప్రాంతం రాజమహేంద్రవరానికి దగ్గరగా ఉన్నా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చామని వివరించారు. కోనసీమ ప్రజల కల సాకారం శ్రీకాకుళం పేరుతో ఉన్న సంస్థలన్నీ ఎచ్చెర్లలో ఉన్నందున ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలో కలిపామన్నారు. విజయనగరం విస్తీర్ణం, అభివృద్ధి దెబ్బతినకుండా రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాలను ఆ జిల్లాలో కలిపామని తెలిపారు. విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించినప్పుడు అనకాపల్లి వెనుకబడే అవకాశం ఉండడంతో పెందుర్తిని అందులో కలిపామన్నారు. భీమిలికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలన్న ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమలాపురం కేంద్రంగా ప్రతిపాదించామని తెలిపారు. సగటు జనాభా 20 లక్షలు నరసాపురం పార్లమెంటు స్థానంలో భీమవరం మధ్యలో ఉండడంతో జిల్లా కేంద్రంగా ప్రతిపాదించి కొత్త రెవెన్యూ డివిజన్ తెచ్చామని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. బాపట్లలోని సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలులో కలిసిపోయి ఉండడంతో దాన్ని ప్రకాశం జిల్లాకు కలిపామని తెలిపారు. ఇదే ప్రాతిపదికన నంద్యాలలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో, హిందూపురంలోని రాప్తాడుని అనంతపురం జిల్లాకి కలుపుతున్నట్లు చెప్పారు. తిరుపతి పార్లమెంట్‌లోని సర్వేపల్లి అసెంబ్లీని నెల్లూరు జిల్లాలో, చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించామన్నారు. రాజంపేట జిల్లాను 6 నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తూ పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాకి కలపాలని ప్రతిపాదించామన్నారు. కొత్త ప్రతిపాదిత జిల్లాలో 2011 లెక్కల ప్రకారం సగటున జిల్లాకి 20 లక్షల వరకూ జనాభా నివసిస్తున్నట్లు తెలిపారు. 26 జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ప్రతిపాదిత జిల్లాలోకి, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా నిబంధనలను అనుసరించామని ప్రణాళికా శాఖ కార్యదర్శి తెలిపారు. 26 జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దవిగా ఒంగోలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ రెండు జిల్లాల్లో నల్లమల అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడమేనని తెలిపారు. చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉందన్నారు. విస్తీర్ణం తక్కువైనా భీమవరం, రాజమండ్రి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలని, అక్కడ ఇరవై లక్షల మంది జనాభా ఉంటున్నట్లు చెప్పారు. జన గణన అడ్డంకి కాదు.. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయవచ్చని, సహేతుక కారణాలుంటే పరిగణనలోకి తీసుకునే అవకాశముంటుందని ప్రణాళిక శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించాక వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త జిల్లాలపై తుది నిర్ణయం ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, ఆర్థిక వ్యవహారాలపై ఆయా కమిటీలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తాయన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జనాభా గణన అడ్డంకి కాదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జనాభా గణన ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. సమావేశంలో ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ కె.శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: విజయ్ కుమార్
సాక్షి, విజయవాడ: కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయ్ కుమార్ గురువారం ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్ కుమార్ తెలిపారు. చదవండి: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు.. 63కు చేరిన మొత్తం.. పూర్తి వివరాలు ‘అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నాం. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధిలో ఉంది. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం ఆలోచించి రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పేరున్న ఇన్స్టిట్యూట్లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయి. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపాం. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాంను ఆ జిల్లాలో కలిపాం. విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశాం. పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాం ఉంది. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశాం. రంపచోడవరం అభివృద్ధి కోసమే అల్లూరి జిల్లాలో కలిపాం’ అని తెలిపారు. -
డేటాతో పురోగతికి బాట: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నిర్దేశిత లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం వాటిల్లో డేటాను సేకరించడంతో పాటు క్రోడీకరించి విశ్లేషించాలని సూచించారు. ఆర్బీకేలు, సచివాలయాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించేలా సమాచారం ఉండాలన్నారు. కాకి లెక్కలు కాకుండా వాస్తవాలను వెల్లడించేలా ఈ సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించాలని ఆదేశించారు. దీనిపై పర్యవేక్షించే బాధ్యతలను మండల స్థాయి ఉద్యోగికి అప్పగించాలని సూచించారు. ప్రణాళికా శాఖ అధికారులతో సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో చేపట్టే ఇ–క్రాపింగ్ లాంటి డేటాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, దీనివల్ల ఇ– క్రాపింగ్ సక్రమంగా జరుగుతోందా? లేదా? అనే అంశంపై దృష్టి సారించవచ్చన్నారు. కేవలం డేటాను సేకరించడమే కాకుండా విశ్లేషించడం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలన్నారు. వివిధ కార్యక్రమాలకు సంబంధించి ఎంతవరకూ లక్ష్యాన్ని చేరుకున్నాం? లోపాలేమిటి? తదితర అంశాలను గుర్తించి ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు కార్యక్రమాలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద మరింత సహకారం అందేలా కృషి చేయాలన్నారు. ఉగాది రోజు వలంటీర్లకు సత్కారం.. వలంటీర్లను ఉగాది రోజు సత్కరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలన్నారు. సేవారత్న, సేవామిత్ర లాంటి అవార్డులతో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లను సత్కరించాలని సూచించారు. సమీక్షలో ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్ సీఈవో జె.విద్యాసాగర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐరాస లక్ష్యాలను సాధించేలా సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల్లో ఇంటర్నెట్ సరిగా పనిచేస్తోందా? లేదా? అనే వివరాలు ఎప్పటికప్పుడు అందాలని, దీనివల్ల పాలన సమర్థంగా ముందుకు సాగుతుందని సీఎం పేర్కొన్నారు. సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐరాస, అనుబంధ విభాగాలు సహా ప్రపంచస్థాయి సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కో లాంటి సంస్థలతో కలసి పని చేయాలని సూచించారు. -
వాలంటీర్లకు ప్రోత్సాహకాలు: సీఎం జగన్
-
వాలంటీర్లకు ప్రోత్సాహకాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయ వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని పేర్కొన్నారు. సేవారత్న, సేవామిత్ర.. పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించాలన్నారు. ప్రణాళిక శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నిర్ధేశిత లక్ష్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయంలో కూడా డేటా క్రోడీకరణ ఒకరికి అప్పగించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని, మండల స్థాయిలో ఉన్న ఉద్యోగి దీన్ని సూపర్ వైజ్ చేస్తారని తెలిపారు. అదే విధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న డేటాను స్వీకరించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆర్బీకేల పరిధిలో చేస్తున్న ఇ-క్రాపింగ్ లాంటి డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీనివల్ల ఇ-క్రాపింగ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టగలుగుతామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల వద్ద ఇంటర్నెట్ సరిగ్గా పనిచేస్తుందా? లేదా? అన్న డేటా కూడా ఎప్పటికప్పుడు రావాలన్నారు. దీనివల్ల పాలన, పనితీరు సమర్థవంతంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. అయితే ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ విభాగాలు సహా ప్రపంచ స్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కోలాంటి సంస్థలతో కూడా కలిసి పనిచేయాలని సూచించారు. డేటాను కేవలం సేకరించడమే కాకుండా.. ఆ డేటా ద్వారా తీసుకోవాల్సిన చర్యలమీద కూడా దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో మనం ఎంతవరకూ లక్ష్యాన్ని చేరుకున్నాం, లోపాలేమిటో గుర్తించాలని తెలిపారు. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశానికి ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్ సీఈవో జే విద్యాసాగర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: మంత్రి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్ పంచాయతీ ఎన్నికలు; ‘అనంత’లో రికార్డ్ మెజారిటీ -
‘యువ’తరం తగ్గుతోంది!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘యువ’తరం తగ్గిపోతోంది. 2011 గణాంకాలతో పోలిస్తే.. 2026 నాటికి 20 ఏళ్లలోపు యువత ఏకంగా 22 లక్షల మంది తగ్గనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా శాఖ రూపొందించిన జనాభా గణాంకాల అంచనాల్లో వెల్లడైంది. 2011 నాటికి 1.69 కోట్లు ఉన్న 20 ఏళ్లలోపు యువతీ యువకుల సంఖ్య 2026 నాటికి 1.47 కోట్లకే పరిమితం కానున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర జనాభా కేవలం 65 లక్షల మేర మాత్రమే పెరిగే అవకాశం ఉందని ప్రణాళికా శాఖ పేర్కొంది. యువతలో మారుతున్న ఆలోచన 20 ఏళ్లలోపు యువతీ యువకుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం పెళ్లిళ్లు, పిల్లలపై యువతలో మారుతున్న ఆలోచన ధోరణులేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాత తరంలో ఎక్కువ మంది పిల్లలను కనేవారు. ఇటీవల వరకు ఒకరిద్దరు పిల్లలు చాలనే ధోరణి నెలకొంది. కానీ, ఇప్పుడు ఒకరు చాలనే ఆలోచనకు వచ్చేశారని వారు విశ్లేషిస్తున్నారు. దీనివల్లే 20 ఏళ్లలోపు యువతీ యువకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందంటున్నారు. అలాగే, యువకులతో పాటు యువతుల సంఖ్య కూడా సమానంగా తగ్గిపోతున్నట్లు ప్రణాళికా శాఖ అంచనాలో వెల్లడైంది. 1971లో రాష్ట్ర మొత్తం జనాభాలో 20 ఏళ్లలోపు వారి శాతం 48.4 ఉండగా.. అది 2026 నాటికి 26.5 శాతానికే పరిమితం కావచ్చునని ప్రణాళికా శాఖ అంచనాల్లో తేలింది. జనాభా పెరుగుదలలోనూ తగ్గుదలే అలాగే, 1991 నుంచి 2011 వరకు రాష్ట్ర జనాభా 90 లక్షలు పెరగ్గా.. అదే 2011 నుంచి 2026 నాటికి జనాభా పెరుగుదల కేవలం 65 లక్షలు మాత్రమే ఉంటుందని అంచనాల్లో తేలింది. కాగా, 20 ఏళ్ల జనాభా పెరుగుదల శాతం ఆధారంగా విద్యకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ప్రణాళిక శాఖ పేర్కొంది. -
పథకాలు ‘డొల్ల’..
సాక్షి, అమరావతి: శిక్షణ ద్వారా యువతకు భారీఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నామని.. లక్షల్లో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తున్నామని ప్రభుత్వం ఎంతో ఘనంగా చేస్తున్న ప్రచారం అంతా ఉత్తి డొల్ల తప్ప అందులో ఏమాత్రం వాస్తవంలేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే తేటతెల్లమైంది. అలాగే, రాష్ట్రంలో అన్ని జిల్లాలను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించేశామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని కూడా తేలింది. అంతేకాదు.. మహిళలపై నేరాలు ఏటేటా పెరిగిపోతున్నాయని సర్కారు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. (నిరుద్యోగులకు రిక్తహస్తం) ఈ సందర్భంగా ప్రణాళికా శాఖ రూపొందించిన నివేదికలో 17 ప్రభుత్వ పథకాల అమలులో ప్రచార ఆర్భాటం తప్ప మరేంలేదని స్పష్టమైంది. యువతకు శిక్షణ పేరుతో కోట్ల రూపాయల కమీషన్లు ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టు కట్టబెడుతున్నారని.. కానీ, అలా శిక్షణ పొందిన వారికి ఉద్యోగాల కల్పన అంతంతమాత్రంగానే ఉందని ప్రణాళిక శాఖ తన నివేదికలో వివరించింది. 1,21,280 మందికి శిక్షణ పేరుతో ఆయా సంస్థలకు రూ.145.53 కోట్లు చెల్లించేశారు. అయితే, ఇందులో ఉపాధి చూపించింది కేవలం 15,237 మంది కేనని, ఇది కేవలం 21.54 శాతమేనని నివేదికలో పేర్కొన్నారు. ఆదరణ పేరుతో హడావిడి చేసిన సీఎం చంద్రబాబు ఆచరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. డి–కేటగిరిలో 0 నుంచి 40 శాతం అమలు పథకాలను చేర్చారు. ఈ కేటగిరిలో 17 పథకాలున్నాయి. దీంతో పాటు యునిసెఫ్ నిర్వహించిన సర్వేలో 93 శాతం హౌస్ హోల్డ్స్కు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేలింది. వీరిందరూ బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది. మరోవైపు.. బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీలు 12,918కు గాను 1,505 పంచాయతీల్లో.. 110 మున్సిపాల్టీలకు గాను 15 మున్సిపాల్టీల్లో మాత్రమే లక్ష్యం సాధించినట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది. అంటే ఇన్ని రోజులు ఉపాధి హామీ నిధులతో వేల కోట్ల రూపాయలను వ్యయంచేస్తూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేశామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నదంతా బూటకమని తేలిపోయింది. అలాగే, అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీలుగా చేస్తున్నామని చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవంలేదని ప్రణాళికా శాఖ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఏ ఏటికాయేడు పెరుగుతున్నాయి తప్ప తగ్గడంలేదని కూడా ఆ నివేదిక తేల్చిచెప్పింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 8,855 మంది మహిళలపై నేరాలు జరగ్గా ఈ ఏడాది అదే కాలంలో 9,221 మహిళలపై నేరాలు జరగడం గమనార్హం. అత్యధికంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఆ తరువాత స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. (నీటి మీద రాతలు.. టీడీపీ హామీలు) ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల్లోనూ అంతే.. అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇంటి జాగాలు ఇచ్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలూ బూటకమేనని ప్రణాళికా శాఖ నివేదిక తేల్చిచెప్పింది. అర్హులందరికీ ఇవన్నీ ఇచ్చేస్తే దాదాపు కోటి మంది పేదలు ఇంకా దరఖాస్తులు ఎందుకు చేసుకున్నారో ప్రభుత్వ పెద్దలకే తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం పది శాఖలకు చెందిన పథకాల కోసం ఏకంగా 99,08,297 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. రేషన్ కార్డులుగానీ, పింఛన్లుగానీ అర్హులైన వారందరికీ ఇవ్వకుండా ఖాళీ అయిన చోటే కొత్తవారికి మంజూరు చేస్తున్నారు. దీంతో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందడంలేదు. ఇళ్తు, ఇంటి జాగా, పెన్షన్లు, రేషన్ కార్డులు, మంచినీటి సరఫరా, రహదారులు, వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఏకంగా 99,08,297 మంది ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోగా అందులో ఏకంగా 32,11,595 దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరో 20.81 లక్షల మందికి మంజూరు చేయాలని తేల్చి వారి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మరోవైపు.. ఆర్టీజీఎస్ పేరుతో రకరకాల ఆంక్షలు విధించి పేదలకు పథకాలు అందకుండా వారిపై అనర్హుల పేరుతో వేటువేస్తున్నారు. ప్రాసెస్ చేయలేదని, మ్యాప్ కావడం లేదంటూ మరికొన్ని లక్షల దరఖాస్తులను మూలన పడేస్తున్నారు. -
10 జీవోలు.. రూ.103 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధుల విడుదల ప్రక్రియను కొనసాగిస్తోంది. నియోజకవర్గాల వారీగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కోసం రూ.103.06 కోట్ల నిధులను మంజూరు చేయడం, విడుదల చేయడం ఒకేరోజు పూర్తయ్యాయి. మంగళ వారం ఈ మేరకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు పది వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. నిధుల మంజూరు ఇలా.. - భూపాలపల్లి అసెంబ్లీ నియోజవకర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.34.69 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. - గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, తూప్రాన్, మనోహరాబాద్‌లలో ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కోసం రూ.ఐదు కోట్లను విడుదల చేసింది. ఒక్కో ఫంక్షన్ హాల్‌కు రూ.కోటి చొప్పన కేటాయించింది. తూప్రాన్‌లో వైకుంఠ ధామం (శ్మశాన వాటిక) నిర్మాణానికి రూ.కోటి విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఈ మేరకు నిధులు విడుదల చేసింది. - డోర్నకల్ నియోజకవర్గంలోని ఉగ్గంపల్లి, నర్సింహులపేట, కందికొండ ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.2.40 కోట్లను విడుదల చేసింది. ఇందులో నర్సింహులపేట, కొందికొండ ఆలయాలకు రూ.కోటి చొప్పున, ఉగ్గంపల్లి ఆలయానికి రూ.40 లక్షలు కేటాయించింది. - ఆసిఫాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు వేయాల్సిన 299 బోర్ల కోసం రూ.2.11 కోట్లను, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 52 బోర్లను వేసేందుకు రూ.75 లక్షలను విడుదల చేసింది. -నల్లగొండ జిల్లాలో చేపట్టిన రజక భవన్ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన రూ.50 లక్షలను మంజూరు చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల కోటాలో వీటిని కేటాయించింది. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 44 బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.55.61 కోట్లను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఈ నిధులు మంజూరయ్యాయి. - కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కందికొట్కూర్‌లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.కోటి విడుదల చేసింది. -
ఎక్కడిదొంగలు అక్కడనే.. ష్... గప్ చుప్!
- గుట్టుగా సర్దుకుంటున్న అక్రమార్కులు - లొసుగులు బయటపడకుండా జాగ్రత్త - దాచిన ఫైళ్లు బీరువాల్లో ప్రత్యక్షం - ఆగమేఘాలపై పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ - ఒక్కరోజులోనే 30 ఫైళ్లకు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ప్రస్తుత పరిస్థితి ‘ఎక్కడి దొంగలు అక్కడే... గప్ చుప్’ అన్నట్లుగా ఉంది. కొత్త కమిషనర్‌గా శాలినీ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరిస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తమ పరిధిలోని ఫైళ్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో.. ? లేదోనన్న విషయాన్ని మరోసారి పరిశీలించుకొని వాటిని ఓ క్రమపద్ధతిలో పెట్టుకొన్నారు. కొత్త కమిషనర్ చార్జి తీసుకున్న వెంటనే విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తే... ఎక్కడా లొసుగులు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఏదైనా ఫైల్‌పై కమిషనర్ ఆరా తీస్తే అందరూ ఒకే విధంగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకించి ప్లానింగ్ విభాగంలో ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ఒకే మాట... ఒకే బాట.. అన్నట్లుగా వ్యవహరించేందుకు పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నట్లు వినికిడి. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు బుధవారం దుమ్ము దులిపారు. వీటిలో ఇప్పటికే హెచ్ఎండీఏకు డబ్బు చెల్లించి ఉన్న ఫైళ్లను ఆగమేఘాలపై విడుదల చేశారు. నిజానికి వీటికి సంబంధించి నిర్ణీత ఫీజు చెల్లింపులు జరిగినా ... మూమూళ్లు ముట్టలేదన్న కారణంతో వాటిని పక్కకు పెట్టారు. అయితే... వీటిపై ఫిర్యాదులు వస్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో వాటిని బుధవారం నాడే విడుదల చేశారు. కొన్ని ఫైళ్లకు సపోర్టు డాక్యుమెంట్లు లేవన్న సాకుగా చూపుతూ రిజెక్టు చేస్తూ మరికొన్నింటికి డీసీ లెటర్లు పంపడం గమనార్హం. ఇటీవల వరకు ఇన్స్పెక్షన్ల పేరుతో బయటకు వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకొంటున్న కొందరు అధికారులు బుధవారం సాయంత్రం వరకు కార్యాయలంలో కూర్చొని ఫైళ్లను పక్కాగా సర్దిపెట్టుకొన్నారు. ఇదే తరుణంలో కొన్ని అనుమతుల విషయంలో అక్రమాలు, అవకతవకలు బయటపడకుండా ఆయా ఫైళ్లను దాచేశారు. ఇదే క్రమంలో గతంలో తమ ఇళ్లలో దాచేసిన ఫైళ్లను గుట్టుగా బ్యాగుల్లో తెచ్చి బీరువాల్లో పెట్టేశారు. ఇన్వార్డ్... అవుట్ వార్డ్ రిజిస్టర్లను సైతం సరిదిద్ది జాగ్రత్త చేశారు. రూ.4-5 కోట్లు జుర్రేశారు.. కొత్త కమిషనర్ చార్జి తీసుకొంటే అక్రమాలకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు చ క్రం తిప్పారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ఫైళ్ల క్లియర్ చేసి సుమారు రూ.4-5కోట్లు దండుకొన్నట్లు హెచ్ఎండీఏలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అన్ని అనుమతులున్న ఫైళ్లకు అప్రూవల్ ఇస్తూ అందినకాడికి జుర్రుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకించి ఘట్కేసర్, శంకర్పల్లి, శామీర్‌పేట, మేడ్చల్ జోనల్ కార్యాలయాల పరిధిలో అనాథరైజ్డ్ లేఅవుట్లు ఇటీవల నోటీసులు జారీ చేశారు. వీటిని అందుకొన్న రియల్టర్లు బుధవారం తార్నాకకు వచ్చి ఆ జాబితాలో తమ పేర్లు లేకుండా పెద్దసార్లను కలిసి భారీగా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మేడ్చల్, సంగారెడ్డి, శామీర్‌పేట ప్రాంతాల్లోని పరిశ్రమలకు సంబంధించిన ఫైళ్లను బుధవారం నాడే క్లియర్ చేయడం గమనార్హం. అలాగే లేఅవుట్లు, గ్రూపు హౌసింగ్ కాలనీలకు కూడా పెద్దసంఖ్యలో అనుమతులు మంజూరు చేశారని సిబ్బందే చెప్తున్నారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పలువురు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని పూర్తిచేయడంతో బుధవారం హెచ్ఎండీఏలో అక్రమార్కుల కాసుల వర్షం కురిసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. వీరిని పట్టించుకొనే నాథుడే లేకపోవడంతో తార్నాకలో ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమే. -
మూడు రోజుల ఫోన్ బిల్లు రూ.2,15,000
-
కనికరించని చినుకు
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితి సాధారణం కంటే 31 శాతం తక్కువ నమోదు 14 మండలాల్లో మరీ ఘోరం ఖరీఫ్ గండంపై ప్రణాళికశాఖ నివేదిక విశాఖపట్నం : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మునుపెన్నడూలేనివిధంగా కొన్ని మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. సాధారణం కంటే 31శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. ఈపాటికే జలాశయాలు,నదులు,చెరువులు,పంటపొలాలు నిండుగాకళకళలాడాలి. ఎక్కడికక్కడ అడుగంటి వెక్కిరిస్తున్నాయి. ఆగస్టు రెండోవారం ముగిసిపోతున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 13వరకు జిల్లావ్యాప్తంగా మండలాల వారీ వర్షపాత వివరాలు సేకరించిన ప్రణాళికశాఖ అధికారులు తీవ్ర వర్షాభావ పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 407.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. ఇంతవరకు 280.5 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే 31శాతం తక్కువ. 14మండలాల్లో సాధారణంలో సగం కూడా కురవకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా అచ్యుతాపురంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సాధారణ వర్షపాతం 338.8 మిల్లీమీటర్లు. ఇక్కడ కేవలం 122.8 మిల్లీమీటర్లే నమోదైంది. పరవాడ (55శాతం), బుచ్చయ్యపేట (55శాతం), కశింకోట (54శాతం), సబ్బవరం (52శాతం), మాకవరపాలెం (56శాతం), కె.కోటపాడు (54శాతం), ఎలమంచిలి (47శాతం), పెందుర్తి (40శాతం), కొయ్యూరు (61శాతం), చోడవరం (47శాతం) చొప్పున తక్కువగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తేల్చారు. ఏజెన్సీలో ముంచంగిపుట్టులో సాధారణం కంటే 4శాతం, పాడేరు 11శాతం, పాయకరావుపేటలో 8శాతం, విశాఖపట్నం అర్బన్ 28శాతం చొప్పున ఎక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2,27,400 హెక్టార్లు. వర్షాభావం కారణంగా ఇంతవరకు కేవలం 56,500 హెక్టార్లలోనే పంటలు చేపట్టారు. వరి సాధారణ విస్తీర్ణం 1.10లక్షల హెక్టార్లు కాగా, ఇంతవరకు 3,400హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ పరిస్థితులను అధికారులు నివేదించారు. అయితే ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున మరికొంత కాలం ఆగి కరువు మండలాల జాబితా తయారుచేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. -
హెచ్ఎండీఏలో పౌరసేవలు
భువనగిరి, న్యూస్‌లైన్ : హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోని ప్రజలకు సత్వర సేవలందించేందుకు తార్నాకలోని ప్రధాన కార్యాలయంలో కొత్తగా పౌరసేవల కేంద్రాన్ని (సిటిజన్ ఫెసిలిటేషన్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలు హెచ్ఎండీఏ కిందకు వస్తాయి. వీటి పరిధిలో మొత్తం 131 గ్రామాలున్నాయి. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో ఉన్న జోనల్ కార్యాలయ వ్యవస్థలో ప్రజలు తమ ప్రధాన పనులైన ప్లానింగ్ కోసం పడుతున్న అవస్థలతోపాటు అధికారులు, సిబ్బంది అవినీతిపై అనేక ఫిర్యాదులు రావడంతో హెచ్ఎండీఏ తాజాగా పౌరసేవల విభాగాన్ని తార్నాకలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. రెండు నెలల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు సత్వరం సేవలందించేందుకు ప్లానింగ్ విభాగం విధులు పునర్నిర్మాణం, కంప్యూటరైజేషన్‌పై ఇటీవల అధ్యయనం చేయించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, ఫిర్యాదుల మేరకు పౌరసేవల కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పధానంగా నిర్మాణాల అనుమతుల్లో జాప్యానికి తావులేకుండా జేపీఓ, ఏపీఓ, పీఓ, సీపీఓలను ఒక యూనిట్‌గా చేర్చి ఒకేచోట విధులు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులో ఏదైనా పత్రం (జీరాక్స్ కాపీ) మిస్ అయితే దానికి హెచ్ఎండీఏనే బాధ్యత వహిస్తుంది. మొదట జేపీఓ లేదా ఏపీఓలు దరఖాస్తులను ప్రాసెసింగ్ చేసి వారంలోగా పై అధికారులకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయా ఫైళ్లు ఎక్కడైనా ఆగితే ఎందుకు ఆగిందనే విషయం తెలుసుకుని వారిపై చర్యలు తీసుకునే అధికారం సీపీఓ స్థాయి అధికారికి ఇచ్చారు. కాగా ప్లానింగ్ విభాగాన్ని మొత్తం 5 యూనిట్లుగా విభజించారు. ఇందులో మాన్యువల్, అన్లైన్ సేవలు అందిస్తారు. జోనల్ ఆఫీసర్లకు టాటా...! జోనల్ అధికారులను తప్పించి వారి సేవలను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలోని కీలక విభాగాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా జిల్లా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘట్కేసర్ జోనల్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. భూములకు సంబంధించిన వివాదాలను త్వరగా పరిష్కరించే ఉద్దేశంతో జోనల్ అధికారులుగా రెవెన్యూ శాఖకు చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. జోనల్ కార్యాలయాలు ఉన్నప్పటికీ అక్కడ ఏపీఓ, జేపీఓల ద్వారా దరఖాస్తులను స్వీకరించి, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. వీటిలో భవన నిర్మాణంలో అతిక్రమణలుంటే ఏపీఓ, జేపీఓలు గ్రామ పంచాయతీల ద్వారా నోటీసులు ఇప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తద్వారా ఎలాంటి జాప్యానికి, అవినీతికి తావులేకుండా చూడాలన్నదే హెచ్ఎండీఏ ఉద్దేశంగా కన్పిస్తోంది.