సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
అంతకుముందు, వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. దాదాపు నెలన్నర రోజులుగా జైలులో ఉంటున్నానని, కస్టడీ విచారణ కూడా ముగిసిందని భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఏప్రిల్ 24 నుంచి చంచల్‌గూడ జైలులో ఉంటున్న భాస్కర్‌రెడ్డి గత వారం అస్వస్థతకు గురవ్వగా.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు హృదయ సంబంధ సమస్యలున్నట్లు గుర్తించారు. దీంతో నిమ్స్‌కు తరలించి.. పలు పరీక్షలు చేశారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్
Comments
Please login to add a commentAdd a comment