సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు ఇచ్చింది.
ఎస్కార్ట్ బెయిల్‌లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. ఎస్కార్ట్ బెయిల్‌లో వీళ్లు భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో.. ఈ ఏప్రిల్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని పులివెందులలో విచారించి.. నాటకీయ పరిణామాల నడుమ అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సీబీఐ అధికారులు. అప్పటి నుంచి ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.
మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయగా.. ఇవాళ ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అంతకు ముందు ఉదయ్ కుమార్‌రెడ్డికి కూడా సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ భార్య గర్భవతిగా ఉండడంతో ఆమెను కలిసేందుకు 14 నుంచి 16వ తేదీ వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి: Viveka Caseలో దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'
Comments
Please login to add a commentAdd a comment