కొలిమిగుండ్లలో టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బిజ్జం భాస్కరరెడ్డికి చెందిన విష్ణు సోషియో కల్చరల్ క్లబ్‌పై మంగళవారం పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 54 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కొలిమిగుండ్లలో టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బిజ్జం భాస్కరరెడ్డికి చెందిన విష్ణు సోషియో కల్చరల్ క్లబ్‌పై మంగళవారం పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేకాటరాయుళ్లను ట్రాక్టర్లలో బస్టాండ్ వద్దకు తీసుకొచ్చి ఇక ముందు పేకాట జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేయించారు.
కొలిమిగుండ్ల : కొలిమిగుండ్లలో టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బిజ్జం భాస్కర్‌రెడ్డికి చెందిన విష్ణు సోషియో కల్చర్ క్లబ్‌పై పోలీసులు మంగళవారం మళ్లీ దాడులు చేశారు. కోవెలకుంట్ల సీఐ నాగరాజు యాదవ్, కొలిమిగుండ్ల, సంజామల, రేవనూరు, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఎస్‌ఐలు రాజ్‌కుమార్, చంద్రశేఖరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, సుబ్బరాయుడు, నవీన్‌బాబు తమ సిబ్బందితో స్థానిక పైన పేర్కొన్న క్లబ్‌పై దాడులు చేశారు.
వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పేకాట ఆడేందుకు వచ్చిన 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.లక్షకు పైబడి నగదు, సెల్‌ఫోన్లు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వారందరినీ ట్రాక్టర్లలో షిర్డిసాయి మందిరం మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. బస్టాండ్‌లో ట్రాక్టర్లను ఆపి ‘జీవితంలో పేకాట జోలికి వెళ్లమంటూ’ ప్రతిజ్ఙ చేయించారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు. నెల వ్యవధిలో ఇదే క్లబ్‌పై పోలీసులు రెండు సార్లు దాడులు చే యడం విశేషం. కాగా పోలీసులను గ్రామస్తులు ప్రశంసించారు.