సోమందేపల్లి, న్యూస్‌లైన్: రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నాగినాయనిచెరువు, గుడిపల్లి పంచాయతీల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ ఆధ్వర్యంలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, నియోజకవర్గ అబ్జర్వర్ సుధాకర్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు లోచర్ల భాస్కర్‌రెడ్డి తదితరులు గుడిపల్లిలోని సజ్జగంట రంగనాథస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం నాగినాయనిచెరువు, బుస్సయ్యగారిపల్లి, నాగినాయనిచెర్వు తాండా, వెలగమాకులపల్లి, గుడిపల్లి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మహానేత అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతివ్వాలన్నారు. నాగినాయనిచెరువులో వరి మళ్లలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి అజెండాను వివరించి మద్దతు కోరారు. కార్యక్రమంలో సానే ఉషారాణితోపాటు మండల కన్వీనర్ నారాయణస్వామి, కిసాన్‌మోర్చా జిల్లా కన్వీనర్ జీవీపీ నాయుడు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యలు నాగ భూషణ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు అశ్వర్థమ్మ, సర్పంచులు, సింగిల్ విండో డెరైక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక
ఈ సందర్భంగా గుడిపల్లికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ తదితర నాయకులు కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ర్ట సమైక్యతకోసం కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనని, ఆయన స్ఫూర్తితోనే పార్టీలో చేరినట్లు ఉపసర్పంచ్ నరసింహమూర్తి, హరినాథ్, చంద్రశేఖర్, సోము, రమేష్, హరికృష్ణ, చంద్రశేఖర్ తదితరులు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణ స్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాగభూషణ్ రెడ్డి, సర్పంచు నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యం
Published Sat, Jan 4 2014 2:51 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement
Advertisement