ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటం చేయూలని, అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణరుుంచింది.
ప్రజాసమస్యలపై పోరాటం
మంకమ్మతోట : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటం చేయూలని, అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణరుుంచింది. పార్టీ జిల్లా సమీక్షను జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలకులు నల్లా సూర్యప్రకాశ్ సమక్షంలో నగరంలో ఆదివారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై పో రాటం చేస్తూనే ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయూలని సూచించారు. ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరిస్తున్నారని, నియంత పోకడలతో కుటుంబపాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయూలని చర్చించారు. నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి ఇన్నేళ్లరుునా ఏర్పాటుపై చర్యలు తీసుకోవడం లేదని, ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా పాదయూత్ర చేపట్టాలని సమావేశంలో నిర్ణరుుంచారు.
ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పోరాటాలు చేయూలని, మానేరు నీటి వాడకంలో జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాకేంద్రంలో అస్తవ్యస్తంగా మారిన అండర్‌గ్రౌండ్ డ్రెరుునేజీ నిర్మాణంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణరుుంచారు. సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయూలు, ప్రజాసమస్యలను వివరించారు. త్వరలోనే రాష్ట్ర నాయకులతో చర్చించి జిల్లా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో మధ్యమానేరు, తోటపల్లి రిజర్వాయర్, వరదకాలువ పనులు నిలిచిపోయూయని, చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోరుుందని, జిల్లాలో ఇద్దరు కీలక మం త్రులు, చీఫ్ విప్ ఉన్నారని, అరుునా ప్రాధాన్యం లేకుండా పోరుుందని ఎప్పటికప్పుడు సమస్యలపై గళమెత్తాలని పరిశీలకులు నల్లా సూర్యప్రకాశ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్‌పల్లి శ్రీనివాస్‌రావు, రాష్ర్ట కార్యదర్శి అక్కెనపెల్లి కుమార్, రాష్ర్ట సంయుక్త కార్యదర్శి డాక్టర్ కె. నగే ష్, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సహాయ పరిశీలకుడు కొమ్మర వెంకట్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ర్ట నాయకుడు గుర్రాల సంతోష్‌రెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బోగె పద్మ, జిల్లా నాయకురాలు మోకెనపెల్లి రాజమ్మ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వరాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు గాలి ప్రశాంత్‌బాబు, జిల్లా నాయకులు ముస్కు వెంకటరెడ్డి, దేవరనేని వేణుమాధవ్‌రా వు, బండమీది అంజి, గండి శ్యామ్, గండి గణేష్, లక్ష్మీనారాయణ, పి.వేణుగోపాల్‌రెడ్డి, సలీమ్, బలాల, రాజేశం పాల్గొన్నారు.