సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలు అధికారులు శనివారం ఉదయం భాస్కర్ రెడ్డిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో వైద్య చికిత్సలు, యాంజియోగ్రామ్ చేయనున్నారు వైద్యులు.
కాగా, వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. భాస్కర్‌రెడ్డికి బీపీ లెవల్స్ తగ్గడంతో జైలు అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు. భాస్కర్‌రెడ్డికి హృదయ సంబంధ సమస్యలు ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు ఆయనకు యాంజియోగ్రామ్ చేయించాలని సూచించినట్లు తెలిసింది. వైద్యుల సూచన మేరకు భాస్కర్‌రెడ్డిని నిమ్స్‌కు తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment