రైతుల పరువుతో ఆటలు | the bank officials gave overdue notices to farmers | Sakshi
Sakshi News home page

రైతుల పరువుతో ఆటలు

Published Fri, Jun 20 2014 3:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రైతుల పరువుతో ఆటలు - Sakshi

రైతుల పరువుతో ఆటలు

కుంచేపల్లి (పొదిలి) : ఊరందరిదీ ఒక దారైతే.. .ఉలిపి కట్టెది మరోదారి అన్న చందంగా ఉంది మండలంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల వ్యవహారం. గతంలో పంట నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నష్ట పరిహారం పంపిణీ గురించి ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. మరో వైపు ఖరీఫ్ ప్రారంభం కాబోతోంది. విత్తనాలు, మందులు, ఎరువులు, పురుగుమందుల కోసం పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలో తెలియని అయోమయ స్థితిలో రైతులు దిక్కుతోచక అల్లాడుతున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో గోరు చుట్టుపై రోకటి పోటు చందంగా.. బ్యాంకు అధికారులు మాత్రం బంగారు రుణాలు చెల్లించకుంటే ఈ నెల 20న మీ బంగారు నగలు వేలం వేస్తామని రైతులకు నోటీసులు పంపించారు.
 
 =    ఈ నోటీసులు చూసుసుకున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒక వైపు ప్రభుత్వం రైతుల రుణాల మాఫీపై ఎటూ తేల్చక పోవటం.. ముందుగానే తొందరపడి రావాల్సింది రాబట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు.
 =    ఈ విషయమై బ్యాంకులో సంప్రదించగా నోటీసులు పంపిన మాట వాస్తవమేనన్నారు. వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. మేనేజర్ అనుమతి లేనిదే వివరాలు వెల్లడించలేమని, మేనేజర్ ఈ విషయంపైనే చర్చించేందుకు హెడ్ ఆఫీస్‌లో సమావేశానికి హాజరయ్యారని సిబ్బంది తెలిపారు.
 =    బ్యాంకు పరిధిలో రామాపురం, సూదనగుంట, ఈగలపాడు, కుంచేపల్లి, పాములపాడు, దాసల్లపల్లి తదితర గ్రామాలు ఉన్నాయి.
 =    {పభుత్వం రుణాలు మంజూరు చేస్తే తిరిగి బ్యాంకులకు వెళ్లి రుణం పొందాలనే ఆలోచన రైతులు చేస్తున్నారు.
 =    బ్యాంకు అధికారులు ఎలాగైనా రైతులను బెదిరించో.. అదిరించో వేలం తేదీలోపే రుణాలు కట్టించుకోవాలనే విధంగా వ్యవహారం చేస్తున్నారు.
 =    శుక్రవారం వేలం కావటంతో ఏమి జరుగుతుందోననే విపరీత ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
 =    చెల్లించాలంటే డబ్బులు ఎక్కడ  నుంచి సర్దుబాటు చేయాలో తెలియటం లేదు.
 =    చెల్లించకుంటే వేలం వేస్తారేమోననే ఆందోళనతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. శుక్రవారం వేలం జరిగితే రైతులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విపత్తు నుంచి రైతులను కాపాడాల్సిన అవసరం ఉంది.
 
ఏం చేయాలో అర్థం కావడం లేదు : బి.వెంకటేశ్వర్లు

2012 మే నెలలో బంగారం తాకట్టు పెట్టి రూ.63 వేల రుణం తీసుకున్నాం. ఏప్రిల్ 14 నాటికి వడ్డీతో కలిపి రూ.74,289లు అయింది. గతేడాది వ్యవసాయం అంతగా కలిసి రాలేదు. రుణం చెల్లించకుంటే నగలు వేలం వేస్తామని బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. ఇప్పుడు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు.
 
 బ్యాంకు నుంచి నోటీస్ వచ్చింది :రోజమ్మ
బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి రూ.50 వేల రుణం తీసుకున్నా. వడ్డీతో కలిపి మొత్తం రూ.58,585లు అయిందని, వెంటనే చెల్లించాలని నోటీసు వచ్చింది. ఇప్పటికిప్పుడు చెల్లించమంటే డబ్బలు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావటం లేదు. బంగారం వేలం వేస్తారేమోనని భయంగా ఉంది.
 
ఇంత అన్యాయమా?: ఎం.భాస్కర్‌రెడ్డి

బంగారం తాకట్టు పెట్టి రూ.27 వేల రుణం తీసుకున్నా. ఏప్రిల్ 2014 నాటికి రూ.31791లు అయింది. డబ్బులు కట్టమని బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. రైతులను ఇంత అన్యాయం చేయటం ధర్మం కాదు. రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం అంటుంటే.. బ్యాంకులు అవేమీ పట్టించుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement