
పులివెందుల: విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని వైఎస్సార్‌సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చి శనివారం తనను విచారణకు పిలిచినట్లు కొన్ని వార్తా పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని ఖండించారు.
గతంలో నోటీసు ఇవ్వడానికి సీబీఐ అధికారులు వచ్చినప్పుడు తాను ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల వల్ల ఈనెల 24 తర్వాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని తెలిపారు. ఆ తర్వాత తనకు సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు.