జన్మభూమి బ్యానర్‌పై మాజీ మంత్రి ఫొటో
అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే
క్షమాపణ కోరిన తహశీల్దార్
పాకాల : జన్మభూమి ప్రభుత్వ అధికారిక కార్యక్రమముని, గ్రామసభలకు సంబంధించిన బ్యానర్‌పై స్థానిక శాసనసభ్యునిగా తన ఫొటో ప్రచురించకుండా మాజీ మంత్రి ఫొటో పెట్టడమేమిటని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తహశీల్దార్ కృష్ణయ్యుపై మండిపడ్డారు. పాకాల వుండలంలోని శంఖంపల్లెలో మంగళవారం జరిగిన గ్రామసభలో వేదికపై ఏర్పాటుచేసిన అధికారిక బ్యానర్‌పై మాజీవుంత్రి గల్లా అరుణకువూరి ఫొటోను ముద్రించారు. ఈ బ్యానర్‌పై స్థానిక ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి ఫొటో లేదు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సభాప్రాంగణం ముందు కారులోనే ఉండిపోయూరు. ప్రభుత్వ కార్యక్రవుంలో నిబంధనలకు విరుద్ధంగా అనధికార వ్యక్తి ఫొటోతో బ్యానర్ ఏర్పాటు చేయడం ఏంటని తహశీల్దార్‌ను ప్రశ్నించారు.
ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలను జన్మభూమి అధికారిక బ్యానర్‌పై ఉండాలన్నారు. బ్యానర్‌ను తొలగిస్తేకానీ తాను సభావేదికపైకి రానని చెప్పి ఆయన దాదాపు పది నిమిషాలపాటు కారులోనే కూర్చుండిపోయూరు. దీంతో బ్యానర్ తయారు చేయించిన పంచాయుతీ కార్యదర్శి స్వర్ణమంజులపై తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో పార్టీలను మోయవద్దని ఆమెపై మండిపడ్డారు. ఫ్లెక్సీని వెంటనే మార్పించి, జన్మభూమి బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డిని వేదికపైకి ఆహ్వానించారు. ఈ ఘటనపై తహశీల్దార్ క్షమాపణ కోరారు.