the former minister
-
పదవులకన్నా ప్రజలే ముఖ్యం
అనంతపురం టౌన్ : తనకు పదవులకన్నా ప్రజలే ముఖ్యమని మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్లు మంత్రిగా సేవ చేశారని, ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఇకపై పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు తనకు సమయం దొరికేది కాదని, ఇప్పుడు తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. సమాచార శాఖ మంత్రిగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించామన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి జర్నలిస్టులు కూడా కారణమన్నారు. హంద్రీ నీవా నీటిని పుట్టపర్తి నియోజకవర్గంలోని చెరువులకు తీసుకెళ్తామన్నారు. అనంత కరువు నివారణకు ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంతో మాట్లాడుతామని చెప్పారు. -
నా చావుకు మంత్రే కారణం..
మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీపై ఆరోపణలు బెంగళూరు: ‘నా కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాల్సిందిగా ఎంతగానో బతిమాలాను. అయినా పోలీసులు నన్ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అప్పటి మంత్రి కె.జె.జార్జ్‌తో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ దృష్టికి తీసుకొచ్చినా వారు కూడా న్యాయం చేయలేదు. నా చావుకు వీరే కారణం’ అంటూ తన మరణానికి ముందు వీడియో రికార్డ్ చేశాడు రామనగర జిల్లా మాగడి తాలూకా గవినాగమంగళ గ్రామానికి చెందిన రైతు శివణ్ణ(65). వివరాలు.. శివణ్ణ కుటుంబానికి అదే గ్రామంలోని బంధువుల కుటుంబంతో ఆస్తి వివాదం ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఇటీవల శివణ్ణ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడి చేశారు. అంతేకాదు శివణ్ణ భార్యను నడిరోడ్డు పై వివస్త్రను చేసి అవమానించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మంత్రుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినా అక్కడ కూడా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఇక తన సమస్యకు పరిష్కారం లభించదని భావించిన శివణ్ణ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆదివారం తెల్లవారుఝామున శివణ్ణ మృతిచెందారు. మృతిచెందడానికి కాసేపటి ముందు శివణ్ణ ఇచ్చిన స్టేట్మెంట్ను ఆయన కుటుంబ సభ్యులు వీడియో రికార్డ్ చేశారు. ‘నా మరణానికి మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీలు కారణం, అంతేకాదు డీవైఎస్పీ లక్ష్మీగణేష్, స్థానిక పోలీసులు కూడా నా చావుకు కారణం.’ అని వీడియోలో రికార్డ్ చేశారు. ఇదే సందర్భంలో డీజీపీ ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేష్ పేరును కూడా శివణ్ణ పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. -
అమరావతిని ఫ్రీజోన్ చేయాలి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని మాజీ మంత్రి టీ జీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్ లో రాయల సీమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే రాయల సీమ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని.. అన్నారు. రాయల సీమకు నీళ్లు అందించే అన్ని ప్రాజక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. పట్టి సీమ, పోలవరం తో పాటు.. రాయల సీమ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. -
మాజీమంత్రికి మాతృవియోగం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టివసంత్ కుమార్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వాసుకి(70) అనారోగ్యంతో స్వగ్రామం ఎంఎంపురంలో మరణించారు. వాసుకి స్వగ్రామం భీమడోలు మండలం కోళ్ల పంచాయతీలోని ఎంఎంపురం. కొంతకాలంగా అనారోగ్యంతో మంచం మీదే ఉన్నారు. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని దగ్గరిబంధువులు తెలిపారు. -
జన్మభూమి బ్యానర్‌పై మాజీ మంత్రి ఫొటో
అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే క్షమాపణ కోరిన తహశీల్దార్ పాకాల : జన్మభూమి ప్రభుత్వ అధికారిక కార్యక్రమముని, గ్రామసభలకు సంబంధించిన బ్యానర్‌పై స్థానిక శాసనసభ్యునిగా తన ఫొటో ప్రచురించకుండా మాజీ మంత్రి ఫొటో పెట్టడమేమిటని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తహశీల్దార్ కృష్ణయ్యుపై మండిపడ్డారు. పాకాల వుండలంలోని శంఖంపల్లెలో మంగళవారం జరిగిన గ్రామసభలో వేదికపై ఏర్పాటుచేసిన అధికారిక బ్యానర్‌పై మాజీవుంత్రి గల్లా అరుణకువూరి ఫొటోను ముద్రించారు. ఈ బ్యానర్‌పై స్థానిక ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి ఫొటో లేదు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సభాప్రాంగణం ముందు కారులోనే ఉండిపోయూరు. ప్రభుత్వ కార్యక్రవుంలో నిబంధనలకు విరుద్ధంగా అనధికార వ్యక్తి ఫొటోతో బ్యానర్ ఏర్పాటు చేయడం ఏంటని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలను జన్మభూమి అధికారిక బ్యానర్‌పై ఉండాలన్నారు. బ్యానర్‌ను తొలగిస్తేకానీ తాను సభావేదికపైకి రానని చెప్పి ఆయన దాదాపు పది నిమిషాలపాటు కారులోనే కూర్చుండిపోయూరు. దీంతో బ్యానర్ తయారు చేయించిన పంచాయుతీ కార్యదర్శి స్వర్ణమంజులపై తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో పార్టీలను మోయవద్దని ఆమెపై మండిపడ్డారు. ఫ్లెక్సీని వెంటనే మార్పించి, జన్మభూమి బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డిని వేదికపైకి ఆహ్వానించారు. ఈ ఘటనపై తహశీల్దార్ క్షమాపణ కోరారు.