చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్ లో ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిగత వివాదాలు దాడికి దారి తీశాయి. స్థానికంగా నివాసం ఉంటున్న భాస్కర్ రెడ్డి, శంకర్ ఇరువురు చాలాకాలంగా స్నేహితులు. వీరిద్దరూ ఒకే గదిలో నివాసం ఉండేవాళ్లు. అయితే వారిమధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. ఓ విషయమై శుక్రవారం కలుసుకున్న వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు.