‘వివేకా కేసు దర్యాప్తులో దురుద్దేశం కనిపిస్తోంది!’ | Viveka Case: Telangana HC Reserved Orders On Ajay Kallam Petition | Sakshi
Sakshi News home page

వివేకా కేసు దర్యాప్తులో దురుద్దేశం కనిపిస్తోంది!.. అజేయ కల్లం పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Published Fri, Aug 11 2023 4:27 PM | Last Updated on Fri, Aug 11 2023 5:00 PM

Viveka Case: Telangana HC Reserved Orders On Ajay Kallam Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివేకా కేసులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది తెలంగాణ హైకోర్టు. తన స్టేట్‌మెంట్‌ను యధాతథంగా రికార్డు చేయలేదని.. తిరిగి తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయించేలా దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఇవాళ వాదనలు విన్న హైకోర్టు బెంచ్‌..  పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును రిజర్వ్‌ చేసింది.

వివేకా కేసులో సీనియర్‌ అధికారి అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ‘‘సీబీఐ సీఆర్‌పీసీ సెక్షన్‌-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా(అజేయ కల్లం) స్టేట్మెంట్ రికార్డు చేసింది అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్‌మెంట్‌పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్‌ ఐపీఎస్‌లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది.  సీబీఐ తన ఛార్జిషీట్‌లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని అజేయ్ కల్లం తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో పిటిషన్‌ విచారణ అర్హతపై తీర్పు రిజర్వ్‌ చేసింది ధర్మాసనం. 

నాడు చెప్పింది ఇదే..
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్‌ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్‌గారి నివాసంలో  ఉదయం  మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్‌ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్‌ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు.

స్టేట్‌మెంట్‌ అంతా అబద్ధాలమయమే!
జగన్‌ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్‌లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్‌మెంట్‌గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి.  అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని తన పిటిషన్‌లో అజేయ కల్లం కోరారు. 

ఇదీ చదవండి:  బతికున్నోళ్లను సునీతమ్మ బజారుకీడుస్తోంది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement