investigation by the CBI
-
సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్‌కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేయటం గమనార్హం. -
‘వివేకా కేసు దర్యాప్తులో దురుద్దేశం కనిపిస్తోంది!’
సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తన స్టేట్మెంట్ను యధాతథంగా రికార్డు చేయలేదని.. తిరిగి తన స్టేట్మెంట్ను రికార్డు చేయించేలా దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఇవాళ వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును రిజర్వ్ చేసింది. వివేకా కేసులో సీనియర్ అధికారి అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ‘‘సీబీఐ సీఆర్పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా(అజేయ కల్లం) స్టేట్మెంట్ రికార్డు చేసింది అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్మెంట్పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్‌లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని అజేయ్ కల్లం తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో పిటిషన్ విచారణ అర్హతపై తీర్పు రిజర్వ్ చేసింది ధర్మాసనం. నాడు చెప్పింది ఇదే.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్‌గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు. స్టేట్మెంట్ అంతా అబద్ధాలమయమే! జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్మెంట్గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని తన పిటిషన్లో అజేయ కల్లం కోరారు. ఇదీ చదవండి: బతికున్నోళ్లను సునీతమ్మ బజారుకీడుస్తోంది -
YSR జిల్లా పులివెందులలో శాంతియుత ర్యాలీ
-
లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణకు హాజరైన కేజ్రీవాల్
-
‘ఆమంచి’పై సీబీఐ విచారణ కోరుతాం
చీరాల, న్యూస్‌లైన్ : చీరాల నియోజకవర్గం కేంద్రంగా ఆమంచి కృష్ణమోహన్ చేస్తున్న అక్రమాలపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐ ద్వారా విచారణ కోరుతామని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పోతుల సునీత భర్త సురేష్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆమంచి అక్రమాలకు పాల్పడి నెగ్గారని.. చీరాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. పోతుల సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద బైఠాయించి ఆమంచికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఆమంచి అక్రమాలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తన ప్యానల్ ఓటమి చెందితే సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆమంచి విలేకరుల సమావేశంలో చెప్పి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్యానల్‌కు ఆరు కౌన్సిలర్ సీట్లు మాత్రమే దక్కాయని, ఆమంచి మాట మీద నిలబడే వ్యక్తే అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి తీసుకున్న డబ్బుకు లెక్కచెప్పలేకే తాము ఇదంతా చేస్తున్నట్లు ఆమంచి అనడం తన అవివేకానికి నిదర్శనమన్నారు. అడవుల్లో ఉన్నా.. జనజీవనంలో ఉన్నా పేద ప్రజల కోసం పట్టుదలతో పనిచేస్తామని, ఆమంచిలా నీచరాజకీయాలకు పాల్పడమన్నారు.