రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ పి.హరికుమార్‌ను ఏసీబీ అదనపు డైరెక్టర్ (డీఐజీ)గా నియమించింది. వెయిటింగ్‌లో ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను గ్రేహౌండ్స్ డీఐజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా రిటైర్డ్ ఎస్పీ కె.మాధవరావును స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఓఎస్‌డీగా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ నండూరి సాంబశివరావు అభ్యర్థన మేరకు రిటైర్డ్ ఎస్పీ మాధవరావుకు ఓఎస్‌డీగా పోస్టింగ్ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెలకు రూ.50 వేల వేతనంతో ఏడాదిపాటు ఆయన ఓఎస్‌డీగా కొనసాగనున్నారు.