సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమీకృత రైతు సమాచార కేంద్రం ద్వారా రైతులకు అందిస్తోన్న సేవలు బాగున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. మంగళవారం ఆయన గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను సందర్శించారు. కాల్ సెంటర్ ద్వారా రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
చదవండి: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా
రైతుల నుంచి రోజూ ఎన్ని కాల్స్ వస్తున్నాయి? వారి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తు న్నారు? తదితర విషయాలు తెలుసుకు న్నారు. కాల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌బీకే చానల్‌ను సందర్శించి ప్రసారాలు, కార్యక్రమాల వివరాలను ఆరా తీశారు. రైతులకు మరింత ఉప యోగపడేలా ఈ సేవలను విస్తరించాలని సూచించారు. అజేయ కల్లం వెంట రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment