ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి వినయ్ కుమార్, కేంద్ర సర్వీసుకు వెళ్లడంతో సీఎం పేషీలోని మిగతా ఉన్నతాధికారుల శాఖల సర్దుబాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం నిర్ణయం తీసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి వినయ్ కుమార్, కేంద్ర సర్వీసుకు వెళ్లడంతో సీఎం పేషీలోని మిగతా ఉన్నతాధికారుల శాఖల సర్దుబాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా వినయ్ కుమార్ స్థానంలో అజయ్ కల్లాం నియమితులయ్యూరు. అజయ్ కల్లాంతోపాటు వురో ఉన్నతాధికారి జవహర్‌రెడ్డికి కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు. ఆ వివరాలు ఇవీ....
ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లాం: సాధారణ పరిపాలన, హోమ్, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్, రెవెన్యూ, ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం ఇంచార్జి, సీఎం కార్యాలయం ఎస్టాబ్లిష్‌మెంట్, ఇతర అధికారులకు కేటాయించని శాఖలు.
ముఖ్యమంత్రి కార్యదర్శి జవహర్‌రెడ్డి: మున్సిపల్ పరిపాలన-పట్టణాభివృద్ధి, గనులు-భూగర్భవనరుల శాఖ, రవాణా, రహదారులు-భవనాలు, పర్యాటక-సాంస్కృతిక వ్యవహారాలు, అటవీ పర్యావరణశాఖ-శాస్త్ర సాంకేతిక శాఖ, న్యాయ- శాసనభ వ్యవహారాలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయూలు-పెట్టుబడులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం.
సీఎం. ప్రత్యేక కార్యదర్శి ఎస్.ఎస్. రావత్: విద్య, సాంకేతిక విద్య, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, సాగునీరు, ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళిక.
సీఎం. ప్రత్యేక కార్యదర్శి ఎన్. శ్రీధర్: వ్యవసాయం, ఉద్యానవన శాఖ, ఆరోగ్యం, వైద్య విద్య, సహకార-మార్కెటింగ్, పౌరసరఫరాలు, పశుసంవర్థక శాఖ, వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి, క్రీడలు-యువజన సర్వీసులు, గృహనిర్మాణం, కార్మిక-ఉపాధి శాఖలు.
ముఖ్యమంత్రి ఉప కార్యదర్శి జె. మురళి: ప్రత్యేక అభివృద్ధి నిధి, నియోజకవర్గాల అభివృద్ధి నిధి, మారుమూల ప్రాంతాల అభివృద్ధి, ఇందిరమ్మ బాట దరఖాస్తుల పర్యవేక్షణ, సమాచార వ్యవస్థ, ముఖ్యమంత్రి మెయిల్స్, దరఖాస్తులు.