ఆపై ఉరివేసుకుని కుమారుడి ఆత్మహత్య
ఇద్దరికీ మానసిక, ఇతర అనారోగ్య సమస్యలు
కొత్తగూడెం బూడిదగడ్డలో విషాదం
కొత్తగూడెంఅర్బన్: తల్లీకొడుకులిద్దరూ మానసిక వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో తాను మరణిస్తే తల్లిని చూసేవారు ఎవరూ ఉండరన్న ఆవేదనతో కుమారుడు తల్లిని హత్య చేసి.. ఆ తర్వాత తానూ బలవన్మరణానికి పాల్ప డ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శని వారం ఈ విషాద ఘటన వెలుగు చూసింది. పట్ట ణంలోని బూడిదగడ్డ ప్రాంతానికి చెందిన తుల్జాకు మారి పాసి (59)కి హారతిపాసి, వినయ్‌కుమార్ పాసి(28) ఇద్దరు సంతానం.
ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా కూతురు హారతికి పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం తల్లీకొడుకులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. తుల్జాకుమారి కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. వినయ్ కూడా అనారోగ్య సమస్యలతో బేకరీ లో పని మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. కూతురు హారతి కుటుంబం వారికి సమీపంలోనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వినయ్‌కుమార్ ఇనుప రాడ్‌తో తల్లిని కొట్టి హత్యచేసి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రక్తపుమడుగులో తుల్జాకుమారి..
అమ్మ మ్మ, మేనమామకు టిఫిన్ ఇచ్చేందుకు హారతి కూతురు సునన్య శనివారం ఉదయం 10.30 గంటలకు తుల్జాకుమారి ఇంటికి వచ్చింది. ఆమె తలు పు తీసి చూడగా తుల్జాకుమారి రక్తపుమడుగులో పడి ఉంది. వినయ్‌కుమార్ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా.. వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, త్రీటౌన్ పోలీసు లు చేరుకుని ఘటనను పరిశీలించారు. ఇనుపరాడ్ తో కొట్టడం వల్ల తుల్జాకుమారి తలకు తీవ్ర గాయ మై మృతి చెందిందని గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. హారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment