
సాక్షి, జగిత్యాల : అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్‌ను ప్రజా ఆసుపత్రిగా మారుస్తామని టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎల్.రమణ అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబ పాలన నుంచి కాపాడేందుకే ‘మహా కూటమి’ ఏర్పడిందని చెప్పారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ నియంతృత్వ పాలన విముక్తికై పడిన తొలి అడుగే మహా కూటమి అని వ్యాఖానించారు. ‘జగిత్యాల అంటేనే జీవన్.. జీవన్ అంటేనే జగిత్యాల’అని జీవన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగిత్యాల పేరును తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు తెలిసేలా జీవన్‌రెడ్డి పనిచేశారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment