
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, నిజామాబాద్ ఎంపీ
కల్వకుంట్ల కవిత తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కవిత స్వయంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకలతో ప్రగతిభవన్ సందడిగా మారింది.
– సాక్షి, హైదరాబాద్