Batukhamma celebration
-
రామ రామ రామ ఉయ్యాలో..
సాక్షి, హైదరాబాద్: రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం హోరెత్తింది. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా భావించే ఈ పండుగను విదేశీయులు సైతం అమితంగా ఇష్టపడుతున్నారు. శనివారం రవీంద్రభారతి వేదికగా విదేశీయులు బతుకమ్మ ఆడా రు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాహిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాల యం గచ్చిబౌలి వారు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఆకర్షణీయమైన దుస్తులు దరించిన విదేశీయులు కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. ఇండోనేసియా, మలేసియా, రష్యా, అమెరికా, దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, రష్యా తదితర 21 దేశాలకు చెందిన 75 మంది బ్రహ్మకుమారీ మహిళలు, పురుషులు ఇందులో పాల్గొన్నారు. వీరంతా దాదాపు రెండు నెలలపాటు బతుకమ్మ ఆటపాటలపై శిక్షణ తీసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అకాడమీ ఫర్ ఏ బెటర్ వరల్డ్ డైరెక్టర్ బ్రహ్మకుమారీ కులదీప్ సిస్టర్, రష్యాలో బ్రహ్మకుమారీస్ డైరెక్టర్ సంతోష్ సిస్టర్, రజనీ సిస్టర్, జస్టిస్ ఈశ్వర య్య, జస్టిస్ అమర్నాథ్, జస్టిస్ రమేశ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీఎం రెడ్డి పాల్గొన్నారు. ఒక్క పండుగతో వంద లాభాలు.. ప్రపంచంలో ఇలాంటి పండుగ ఎక్కడా చూడలేదు. ప్రకృతి, వైద్యం, వ్యాయామం, సమైక్య త, సమగ్రత వంటి ఎన్నో అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ఆచార, వ్యవహారాలు తెలియచేసేది బతుకమ్మ పండుగ. –బ్రహ్మకుమారీ కులదీప్ సిస్టర్ బతుకమ్మ విశ్వవ్యాప్తం అవుతుంది.. మేం ఎక్కడా ఇలాంటి సంబరాలు చూడలేదు. ప్రకృతిలో వికసించే పూలతో అందంగా బతుకమ్మను పేర్చి ఆడటం వల్ల మనస్సు వికసిస్తోం ది. భవిష్యత్‌లో ఈ పండుగ విశ్వవ్యాప్తం అవుతుంది. బతుకమ్మ ఆటపాటను తమ దేశంలో కూడా ఆడతామని ముందుకు వస్తున్నారు. – సంతోష్ సిస్టర్ ఏకాగ్రత పెరుగుతుంది.. పెద్దలు, పిల్లలతో కలిసి బతుకమ్మ ఆడటం వల్ల అందరి మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. తిరుగుతూ ఆడటంతో ఏకాగ్రత పెరు గుతుంది. ప్రకృతితో మమేకమవుతూ మహిళలు పేర్చే బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ పండుగను ఇక ముందు రష్యాలో కూడా కొనసాగిస్తాం. – నాగమన్జ్, థాయ్‌లాండ్ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశాం.. బ్రహ్మకుమారీస్ 130 దేశాల్లో ఉన్నారు. మూడేళ్లుగా వారితో బతుకమ్మ సంబరాలు చేయిస్తున్నాం. ఈసారి 21 దేశాల కళాకారులు వచ్చారు. 25 దేశాలతో ఎంవోయూకు సిద్ధంగా ఉన్నాం. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయటమే లక్ష్యం. ప్రపంచ పర్యాటకులు అంతా తెలంగాణ వైపు రావాలి. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు తిలకించి వెళ్లాలి. – బుర్రా వెంకటేశం -
ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కవిత స్వయంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకలతో ప్రగతిభవన్ సందడిగా మారింది. – సాక్షి, హైదరాబాద్ -
డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
వాషింగ్టన్: అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో బతుకమ్మ తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలను డల్లాస్‌లోని కోపెల్స్ ఆండ్రూ బ్రౌన్ పార్క్‌లో చేశారు. 200 మందికి పైగా తెలుగు మహిళలు ఒకచోట చేరి బతుకమ్మలను పేర్చి బతుకమ్మ ఆడారు. దాదాపు రెండు గంటలపాటు మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, బొడ్డెమ్మ కొడుతూ ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో శారదా సింగిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, రూప మాచర్ల, ఇందు పంచెరుపూల, దీప్తి, అనురాధ మేకల, మధుమతి వైశ్యరాజు, లక్ష్మీ పోరెడ్డి, ఏ. రోజా, బి. కవిత, జయ తెలుకుంట్ల, తదితరులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడారు. టీపీఏడీ అధ్యక్షుడు కరన్ పోరెడ్డి, కార్యదర్శి రమణ లష్కర్, ఫౌండేషన్ చైర్మన్ ఉపేందర్ తెలుగు, బీఓటీ చైర్మన్ అశోక్ కొండాలా, కో చైర్మన్ మనోహర్ కసగాని, వ్యవస్థాపక సభ్యుడు రఘువీర్ బండారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం అయింది. -
24న న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబరాలు
పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కవిత సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాద్‌లో జాగృతి న్యూజిలాండ్ ప్రతినిధులు ఎంపీ కవితను కలిశారు. ఈ నెల 24న న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం మౌంట్ ఈడెన్హాల్లో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల తెలంగాణవాదులను కూడా ఆహ్వానించాలని ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాగృతి న్యూజిలాండ్ శాఖ ప్రతినిధులు రాంరెడ్డి, రాజీవ్‌రెడ్డి, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్, యూత్ రాష్ట్ర కన్వీనర్ కె.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.