
24న న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబరాలు
పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాద్‌లో జాగృతి న్యూజిలాండ్ ప్రతినిధులు ఎంపీ కవితను కలిశారు. ఈ నెల 24న న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం మౌంట్ ఈడెన్‌హాల్‌లో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
అనంతరం కవిత మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల తెలంగాణవాదులను కూడా ఆహ్వానించాలని ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాగృతి న్యూజిలాండ్ శాఖ ప్రతినిధులు రాంరెడ్డి, రాజీవ్‌రెడ్డి, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్, యూత్ రాష్ట్ర కన్వీనర్ కె.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.