సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార‍్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ హాజరయ్యారు. కాగా ఇంటర్ ఫలితాల అవకతవకల నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 19మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజాగా రాచకొండ కమిషనరేట్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగినేనిపల్లిలో ఇంటర్ విద్యార్థిని మిథి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇంటర్ సెకండియర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఆమె ఈ ఘటనకు పాల్పడింది. మరోవైపు ఇవాళ కూడా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
చదవండి....(మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment