ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్‌ | BJYM Protest Against Police Recruitment Tension At Pragati Bhavan | Sakshi
Sakshi News home page

పోలీసు నియామకాలపై బీజేవైఎం నిరసన.. ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత

Published Thu, Jan 5 2023 1:24 PM | Last Updated on Thu, Jan 5 2023 1:29 PM

BJYM Protest Against Police Recruitment Tension At Pragati Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పోలీసు నియామకాల్లో కొత్త నిబంధనల వల్ల లక్షల మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ నిరసిస్తూ ప్రగతి భవన్‌ను ముట్టడించారు బీజేవైఎం కార్యకర్తలు. పోలీసు నియామకాల్లో గతంలో ఉన్న శారీరక పరీక్షల్లో మార్పులు చేయడంపై నిరసనలకు దిగారు. నిబంధనలను మార్చి, ఎవరైతే ఫిజికల్‌ టెస్టుల్లో నష్టపోయారో వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

 

సీఎం కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ ప్రగతి భవన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. దీంతో ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆందోళనకారులను అరెస్టులు చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు.

ఇదీ చదవండి: ‘కేసీఆర్‌ సర్కార్‌ సర్పంచ్‌ల గొంతులు నొక్కేస్తున్నది’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement