BJYM dharna
-
గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బీజేవైఎం ధర్నా
-
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్ఎల్పీఆర్బీ పోలీసు నియామకాల్లో కొత్త నిబంధనల వల్ల లక్షల మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ నిరసిస్తూ ప్రగతి భవన్‌ను ముట్టడించారు బీజేవైఎం కార్యకర్తలు. పోలీసు నియామకాల్లో గతంలో ఉన్న శారీరక పరీక్షల్లో మార్పులు చేయడంపై నిరసనలకు దిగారు. నిబంధనలను మార్చి, ఎవరైతే ఫిజికల్ టెస్టుల్లో నష్టపోయారో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రగతి భవన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. దీంతో ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆందోళనకారులను అరెస్టులు చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇదీ చదవండి: ‘కేసీఆర్ సర్కార్ సర్పంచ్ల గొంతులు నొక్కేస్తున్నది’ -
మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకున్న బీజే వైఎం కార్యకర్తలు
-
బండారు దత్తాత్రేయ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వం, బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు నివ్వడంతో సీఎం నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కేనన్స్‌తో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రగతి భవన్‌వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశల వారీగా ప్రగతి భవన్ ముట్టడి వస్తున్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. బీజేవైఎం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వినయ్ సహా 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమతో వాగ్వాదానికి దిగిన బీజేవైఎం నేత భానుప్రకాశ్‌పై పోలీసులు పిడిగుద్దులు కురిపించడంతో ఆయన ఆస్పత్రిపాలయ్యారు. కాగా, బీజేపీ నాయకుడు జితేందర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్న ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్.. నిమ్స్‌లో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. -
మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించిన బీజేవైఎం
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బీజేవైఎం నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.