
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమీక్ష సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక‍్టర్లు హాజరయ్యారు.
కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 23 రోజులుగా కొనసాగుతోంది. కార్మికులు, ప్రభుత్వం మధ్య చర్చల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం శనివారం కార్మిక సంఘాల నేతలతో చర్చల ప్రక్రియకు ఆహ్వానించినా అవి ఫలప్రదం కాలేదు. మరోవైపు ఆర‍్టీసీ కార్మికులతో జరిపిన చర్చలపై అధికారులు ఇవాళ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. అంతేకాకుండా కోర్టులో తదుపరి వాదించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్...న్యాయ నిపుణులు,అధికారులతో చర్చించారు. తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment