ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో ప్రగతి భవన్ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడి అక్కడ అదుపులోకి తీసుకుంటారు. మరికొందరు నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాత్రం పోలీసులను బురిడి కొట్టించారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ వారిని తోసుకుంటూ ఇంటి బయటకు వచ్చారు. అక్కడి నుంచి వేగంగా ముందుకు సాగిన రేవంత్.. అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు.