
ప్రగతిభవన్‌లో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో రచయిత జూలూరు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందించిన ‘ఆత్మబంధువు–దళిత సంక్షేమ బంధం’పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జూలూరు తెలిపారు. అనంతరం, తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రికి జూలూరు గౌరీశంకర్ దంపతులు ఆహ్వానపత్రికను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment