సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రగతిభవన్ ముందు ఆందోళనకు దిగిన విపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్‌కు పీపీఈ కిట్‌తో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉదయం నుంచే వివిధ పార్టీల ముఖ్య నేతల ఇళ్ల పాటు, ప్రగతిభవన్ ముందు పోలీసులు భారీగా మొహరించారు.
సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment