
కీవ్: దురాక్రమణ, దాడులతో ఉక్రెయిన్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్న రష్యా మరోమారు హెచ్చరికలు చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ హెచ్చరికలు చేసినట్లు రష్యా అధికారిక టాస్ న్యూజ్ ఏజెన్సీ వెల్లడించింది. ‘ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందనేది ఉక్రెయిన్, దాని మిత్రదేశం అమెరికా వైఖరిపైనే ఆధారపడి ఉంది. ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ(డీమిలిటరైజ్) చేయండి.
నాజీయిజానికి స్వస్తిపలకండి. రష్యాకు సైనిక ముప్పు లేకుండా చూడండి. లేదంటే రష్యా సైన్యమే ఇదంతా చేసి చూపిస్తుంది’ అని లావ్రోవ్ హెచ్చరించారు. రష్యా నేరుగా కలగజేసుకోకుండా ఉంటే వచ్చే రెండు నెలల్లోపు ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో శాంతి చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ప్రకటించిన మరుసటి రోజే అందుకు భిన్నమైన వాదన రష్యా లేవనెత్తడం గమనార్హం.
చదవండి: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు
Comments
Please login to add a commentAdd a comment