ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు బెదిరింపులు వచ్చాయి. రతన్ టాటా ప్రాణానికి ముప్పు పొంచి ఉందని దుండగుడు హెచ్చరించాడు. ముంబయి పోలీస్ కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడని పోలీసులు తెలిపారు. టాటా భద్రతను పెంచాలని లేదంటే ఆయనకు సైరస్ మిస్త్రీ లాగే అవుతుందని బెదిరించినట్లు వెల్లడించారు.
బెదిరింపులు రావడంతో రతన్ టాటా భద్రతను పెంచడంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బెదిరింపు కాల్స్ కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించి.. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు పుణెకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నిందితుడు పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్తీ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్తీతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు
Comments
Please login to add a commentAdd a comment