Tata Industries
-
టాటాకు భారతరత్న ఇవ్వాలని పిటిషన్ దాఖలు.. కోర్టు ఏం చెప్పిందంటే?
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా యావత్ ప్రపంచం రతన్ టాటా దేశానికి చేసిన సేవల్ని, సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే పలువురు టాటాను భారతరత్నతో భారతరత్నతో సత్కరించాలని కోరుకుంటున్నారు.అదే సమయంలో గతంలో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు, ఆ పిటిషన్లపై జరిగిన చర్చ గురించి ప్రస్తావిస్తున్నారు.2022లో టాటాకు భారతరత్న ఇవ్వాలని కోర్టులో పిల్రతన్ టాటా 2000 సంవత్సరంలో దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను, 2008లో భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. కానీ అన్నీ రంగాల్లో అసమాన్య సేవలు చేసినప్పటికీ భారతరత్న అవార్డ్‌ను ఆయన్ని వరించలేకపోయింది.కోర్టు ఏం చెప్పిందంటే? ఇదే విషయంపై విచారణ చేపట్టాలంటూ పిటిషనర్ 2022లో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలు చేశారు. ఆ పిల్లో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కోరారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను.. రతన్ టాటాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై అప్పటి ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం పిల్‌ను కొట్టివేసింది, కోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని పేర్కొంది.పిటిషనర్ స్పందిస్తూదీనిపై పిటిషనర్ స్పందిస్తూ రతన్ టాటా సేవలు అమోఘం. అద్భుతం. అనిర్వచనీయం. అలాంటి మచ్చలేని వ్యక్తికి భారతరత్న అవార్డ్‌ను అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనరే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చని సూచించింది. అనంతరం పిటిషనర్.. దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని లేదంటే జరిమానా విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.దీనిపై నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో #BharatRatnaForRatanTata అనే హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేయగా.. నెటిజన్ల డిమాండ్‌పై రతన్ టాటా స్పందించారు. While I appreciate the sentiments expressed by a section of the social media in terms of an award, I would humbly like to request that such campaigns be discontinued. Instead, I consider myself fortunate to be an Indian and to try and contribute to India’s growth and prosperity pic.twitter.com/CzEimjJPp5— Ratan N. Tata (@RNTata2000) February 6, 2021రతన్ టాటా ట్వీట్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై రతన్ టాటా ట్వీట్ చేశారు. మీ మనోభావాలను నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయండి. దేశాభివృద్ధి, శ్రేయస్సు కోసం నావంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని, దేశ ప్రగతికి సహకరించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానన్నారు.కాగా, రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా, శివసేన (ఏక్నాథ్ షిండే) నేత మహరాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సన్నిహితుడు రాహుల్ కునాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కునాల్ షిండేకి లేఖరాశారు. -
రతన్ టాటాకు బెదిరింపులు
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు బెదిరింపులు వచ్చాయి. రతన్ టాటా ప్రాణానికి ముప్పు పొంచి ఉందని దుండగుడు హెచ్చరించాడు. ముంబయి పోలీస్ కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడని పోలీసులు తెలిపారు. టాటా భద్రతను పెంచాలని లేదంటే ఆయనకు సైరస్ మిస్త్రీ లాగే అవుతుందని బెదిరించినట్లు వెల్లడించారు. బెదిరింపులు రావడంతో రతన్ టాటా భద్రతను పెంచడంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బెదిరింపు కాల్స్ కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించి.. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు పుణెకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నిందితుడు పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్తీ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్తీతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
‘జర ఓపిక పట్టు తమ్మీ’
సాక్షి, అమరావతి : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగానే టాటా సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి సేవ చేస్తుందని వైఎస్సార్సీపీ నేత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) అన్నారు. కానీ కొంత మంది తామే టాటా సంస్థను ఏపీ తెచ్చామని డబ్బాలు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. వైఎస్సార్సీపీపై విమర్శలు చేసే వారు కాస్త ఓపికతో ఉండాలని, త్వరలోనే సీఎం జగన్ వైద్యవ్యవస్థలో మార్పులు తెచ్చి ఆరోగ్యశ్రీకి మళ్లీ పుర్వవైభవాన్ని తీసుకోస్తారని చెప్పారు. ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు టాటాను నేనే తెచ్చా అని డబ్బా ఏంటప్ప. సీఎస్ఆర్ కింద అన్ని కంపెనీలు చేయవలసిన సామాజిక సేవ అది. ఆరోగ్యశ్రీ అనే సంచలనం మన దేశంలో జరిగింది. కొన ఊపిరితో ఉన్న వైద్య వ్యవస్థకు సంజీవని ఇచ్చి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురాబోతున్నారు వైఎస్ జగన్. జర ఓపిక పట్టు తమ్మీ’ అని పీవీపీ ట్వీట్ చేశారు. -
మిస్త్రీకి మరో షాక్!
ముంబై: టాటా గ్రూప్ ఛైర్మన్ గా తొలగించబడిన సైరస్ మిస్త్రీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛైర్మన్ గా తొలగించబడిన తరువాత ఆయన అధికారాలకు, పదవులకు చెక్ పెడుతున్న సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూపుకు చెందిన టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించింది. ఈ మేరకు సోమవారం జరిగిన షేర్ హోల్డర్స్ సమావేశంలో నిర్ణయం జరిగింది. టాటా ఇండస్ట్రీస్ అసాధారణ సర్వ సభ్య సమావేశంలో (ఈజీఎం) ఆయన్ను డైరెక్టర్ గా తొలగిస్తూ నిర్ణయం జరింగింది. మిస్త్రీ తొలగింపుకు అనుకూలంగా వాటాదారులు ఓటు వేశారు. ఆయన డైరెక్టర్ గా కొనసాగితే టాటా గ్రూపు మరింత విచ్ఛిన్నమవుతుందని పేర్కొన్న సంస్థ ఆయన్ను తొలగించాల్సిందిగా వాటాదారులకు విజ్ఞప్తి చేసింది. అలాగే రానున్న రోజుల్లో మిస్త్రీ తొలగింపు కోసం మరో ఆరు టాటా గ్రూపులు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందే ఆయన్ను టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా తొలగించారు. తాజాగా డైరెక్టర్ పదవి నించి కూడా తొలగించిన టాటా సంస్థ మిస్త్రీపై మరింత పట్టు సాధించింది. కాగా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్‌గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్‌హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే.