టాటాకు భారతరత్న ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు.. కోర్టు ఏం చెప్పిందంటే? | PIL Calls for Bharat Ratna for Ratan Tata | Sakshi
Sakshi News home page

రతన్‌ టాటాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌.. కోర్టు ఏం చెప్పిందంటే?

Published Thu, Oct 10 2024 11:39 AM | Last Updated on Thu, Oct 10 2024 12:35 PM

PIL Calls for Bharat Ratna for Ratan Tata

బిజినెస్‌ టైకూన్, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సంద‌ర్భంగా యావ‌త్ ప్ర‌పంచం ర‌త‌న్ టాటా దేశానికి చేసిన సేవ‌ల్ని, సాధించిన విజ‌యాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే ప‌లువురు టాటాను  భార‌తర‌త్నతో భారతరత్నతో సత్కరించాలని కోరుకుంటున్నారు.

అదే స‌మ‌యంలో గ‌తంలో ర‌త‌న్ టాటాకు భార‌తర‌త్న ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్లు, ఆ పిటిష‌న్ల‌పై జ‌రిగిన చ‌ర్చ గురించి ప్ర‌స్తావిస్తున్నారు.

2022లో టాటాకు భారతరత్న ఇవ్వాలని కోర్టులో పిల్‌
ర‌త‌న్ టాటా 2000 సంవ‌త్స‌రంలో దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను, 2008లో భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్ర‌భుత్వం స‌త్క‌రించింది. కానీ అన్నీ రంగాల్లో అస‌మాన్య సేవలు చేసిన‌ప్ప‌టికీ భార‌తర‌త్న అవార్డ్‌ను ఆయ‌న్ని వ‌రించ‌లేక‌పోయింది.

కోర్టు ఏం చెప్పిందంటే? 
ఇదే విష‌యంపై విచార‌ణ చేప‌ట్టాలంటూ పిటిష‌న‌ర్ 2022లో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖ‌లు చేశారు. ఆ పిల్‌లో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కోరారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భార‌త ర‌త్న‌ను.. రతన్ టాటాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై అప్ప‌టి ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం పిల్‌ను కొట్టివేసింది, కోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది.

పిటిష‌న‌ర్ స్పందిస్తూ
దీనిపై పిటిష‌న‌ర్ స్పందిస్తూ ర‌త‌న్ టాటా సేవలు అమోఘం. అద్భుతం. అనిర్వచనీయం. అలాంటి మచ్చలేని వ్యక్తికి భారతరత్న అవార్డ్‌ను అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనరే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చని సూచించింది. అనంతరం పిటిషనర్‌.. దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని లేదంటే జరిమానా విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

దీనిపై నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో #BharatRatnaForRatanTata అనే హ్యాష్ ట్యాగ్‌ను వైర‌ల్ చేయ‌గా.. నెటిజ‌న్ల డిమాండ్‌పై ర‌త‌న్ టాటా స్పందించారు.  


రతన్‌ టాటా ట్వీట్ 
సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై రతన్‌ టాటా ట్వీట్ చేశారు. మీ మనోభావాలను నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయండి. దేశాభివృద్ధి, శ్రేయస్సు కోసం నావంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని, దేశ ప్రగతికి సహకరించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానన్నారు.

కాగా, రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. తాజాగా,  శివసేన (ఏక్‌నాథ్ షిండే) నేత మ‌హ‌రాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సన్నిహితుడు రాహుల్ కునాల్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు కునాల్ షిండేకి లేఖ‌రాశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement