రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో షిమోగా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ కార్యకర్త కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. తన కుమారుడు కేఈ కాంతేశ్‌కు హవేరీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడ్యూరప్పపై ఈశ్వరప్ప మండిపడ్డారు.
వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా, హిందుత్వ కోసం పోరాడతానని ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. షిమోగా మద్దతుదారులతో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
బీజేపీ పార్టీని, దాని సిద్ధాంతాలను కాపాడటానికి ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధమైనట్లు, నరేంద్ర మోదీని మరో సారి ప్రధానిని చేసేందుకు నేను చేస్తున్న పోరాటమని ఈశ్వరప్ప అన్నారు. ప్రస్తుతం ఈ చర్యకు పూనుకోవడం వల్ల బీజేపీ తనకు నోటీసు ఇచ్చే అవకాశం ఉంది లేదా పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో నేను గెలిస్తే.. తప్పకుండా బీజేపీకి మద్దతు ఇస్తానని ఆయన అన్నారు. అయితే బీజేపీ అభ్యర్థి యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ బీ వై రాఘవేంద్ర మరోసారి షిమోగా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారనేది త్వరలోనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment