
సాక్షి, బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశభక్తులైన ముస్లింలు బీజేపీకే ఓటేస్తారని, పాక్ మద్దతుదారులైన ముస్లింలు మాత్రం ఇతర పారీ్టలకు ఓట్లేస్తారన్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలిచాక కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావాలనుకున్నా ముస్లింల ఓట్లు పోతాయనే రాలేదని తనతో చెప్పారన్నారు. ఇక ముస్లింలు బీజేపీ నమ్మరని, అందుకే వారికి టికిట్లు కేటాయించబోమని లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.