బెంగళూరు: ఇటీవల కర్ణాటక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీపై కాంగ్రెస్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నో ప్లాన్స్ చేస్తూ ముందుకుసాగింది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో హస్తం పార్టీ గెలుపు ఖాయమైంది. ఇక, తాజాగా కర్ణాటక రాజకీయాలపై బీజేపీ మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన కామెంట్స్ చేశారు.
అయితే, మాజీ మంత్రి ఈశ్వరప్ప ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్ సిద్ధమైనట్టు తెలిపారు. కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండదని హాట్ కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో సగం మంది హస్తం గూటికి చేరతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కానీ.. ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోరని స్పష్టం చేశారు. దమ్ముంటే నెలరోజుల్లోగా కనీసం ఒక్క ఎమ్మెల్యేను ఆకర్షించాలని ఆయన కాంగ్రెస్‌కు సవాల్ చేశారు. తమ సొంత ఎమ్మెల్యేలకే మీపై నమ్మకం లేదని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని చురకలంటించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ ఈశ్వరప్పకు టికెట్ ఇవ్వలేదు. అనంతరం, ప్రధాని మోదీ.. ఈశ్వర్పకు కాల్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.
Shivamogga, Karnataka | On the question of whether BJP can do 'Operation Lotus' at present, BJP leader KS Eshwarappa says, "Wait and watch, your (Congress) own MLAs don't have hope on you, Congress has no future in this country. Congress party is making big news in the state.… pic.twitter.com/WIa59VKRG7
— ANI (@ANI) September 3, 2023
ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment