సాక్షి, బెంగళూరు : ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. గెలుపే ధ్యేయంగా పార్టీలు పనిచేస్తాయి. అవసరమైతే అడ్డదారులు తొక్కేందుకు కూడా సిద్ధపడతాయి. ఇందుకు నిదర్శనమే కర్ణాటక బీజేపీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు అవసరమైతే అబద్దాలు చెప్పండి.. అని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు. కొప్పాల్ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా వచ్చే ఏడాది ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను అందరూ కలుపుకుపోవాలని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment