‘బీజేపీ కార్యాలయం ఊడిస్తే టికెట్ ఇస్తాం’
► కర్ణాటక శాసనమండలిలో ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: బీజేపీ కార్యలయంలో ముస్లింలు చెత్త ఊడిస్తే వారికి టికెట్ ఇస్తామంటూ కర్ణాటక శాసనమండలిలో ఆ పార్టీ పక్షనేత కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ హర్షద్ రిజ్వాన్ బీజేపీ ముస్లింలకు ఎన్ని టికెట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. దీనికి మా పార్టీ కార్యలయంలో చెత్త ఊడిస్తే ముస్లింలకు టికెట్లు ఇస్తామని ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. ఈ మాటలను అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో సర్దుకున్న ఈశ్వరప్ప ‘మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి చేసింది ఎవరు? జార్జ్ ఫెర్నాండెజ్‌ను కేంద్ర మంత్రిని చేసింది ఎవరు?’అని తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.