లైంగిక దాడులకు వారే కారణం.. | BJP MP Says Rape In India Rising Due To Increasing Muslim Population | Sakshi
Sakshi News home page

లైంగిక దాడులకు వారే కారణం..

Published Fri, Jul 27 2018 3:05 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

BJP MP Says Rape In India Rising Due To Increasing Muslim Population - Sakshi

బీజేపీ ఎంపీ హరి ఓం పాండే (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్‌ బీజేపీ ఎంపీ హరి ఓం పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింల జనాభా పెరుగుతుండటంతోనే లైంగిక దాడులు, హత్యల వంటి నీచమైన నేరాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ముస్లిం జనాభాను పాలకులు కట్టడి చేయకుంటే భారత్‌ నుంచి పాకిస్తాన్‌ వంటి మరో కొత్త దేశం ఆవిర్భవిస్తుందని యూపీలోని అంబేద్కర్‌నగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పాండే సరికొత్త వివాదానికి తెరలేపారు.

ముస్లింల జనాభా పెరగడం వల్లే దేశంలో ఉగ్రవాదం, లైంగిక దాడులు, వేధింపులు పెచ్చుమీరుతున్నాయని, స్వాతంత్ర్యానంతరం దేశంలో ముస్లింల జనాభా గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని గమనించాలని పాండే పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా నిరుద్యోగం తాండవించి, ఆర్థిక వృద్ధి కుంటుపడుతుందన్నారు. ముస్లింలు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుని పది మంది పిల్లల్ని కంటున్నారని, వారికి విద్యాబుద్ధులు నేర్పించకపోవడంతో నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు.

ముస్లింలు ప్రస్తుతం షరియా కోసం డిమాండ్‌ చేస్తున్నారని, భవిష్యత్‌లో వారు మరో పాకిస్తాన్‌ను డిమాండ్‌ చేస్తారని చెప్పుకొచ్చారు. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని బీజేపీ ఎంపీ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement