
సాక్షి,కర్ణాటక: కర్ణాటక బీజేపీ నేత, గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు లోక్‌సభ టికెట్ ఇచ్చేప్రశ్నేలేదంటూ వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెర తీశారు. హిందువులలో ఏ వర్గమైనా పర్వాలేదు. ఎవరికైనా ఇస్తాం..కానీ ముస్లింలకు మాత్రం కచ్చితంగా టికెట్ ఇవ్వమని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇటీవల కాలంలో బెళగావి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే శాఖసహాయ మంత్రి సురేష్ అంగడీ కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. త్వరలో అక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. బెళగావి ఎంపీ టికెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు కేటాయించే ప్రసక్తిలేదని ఆయన తేల్చి చెప్పారు. బెళగావి హిందూత్వనికి కేంద్రమని ఈ నేపథ్యంలో హిందువేతరులకు, ముఖ‍్యంగా కురుబ, లింగాయత్, వక్కలింగా, బ్రాహ్మణ కులాలకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ముస్లింలకు టికెట్ ఇచ్చే ప్రశ్న లేదని ఆయన తెగేసి చెప్పారు. గతంలోనూ ఈశ్వరప్ప ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment