Shop boards
-
‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో సైన్‌బోర్డు, నేమ్ప్లేట్లల వ్యవహారం విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. అయితే ఆందోళనకు దిగిన నిరసనకారులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప మండిపడ్డారు. అరెస్ట్ చేయబడిన నిరసనకారులు నేరస్తులు కాదని.. వారంతా కన్నడ భాష పరిరక్షకులని అన్నారు. కన్నడ భాషలనే నేమ్ ప్లేట్లు, సైన్ బోర్డులు పెట్టాలని నిరసన కారులు చేసిన డిమాండ్ ఆమోదయోగ్యమైందని తెలిపారు. వారిని ఎందుకు అరెస్ట్ చేశారలో తనకు ఇప్పటికీ అర్థం కావటంలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసిన నిరసన కారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. ఇక కర్ణాటకలో వ్యాపారస్తులు తప్పనిసరిగా కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలని అన్నారు. అయితే నిరసకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. నిరసన తెలిపేవారికి తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ.. చట్టం తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని తెలిపారు. చదవండి: ‘కన్నడ’ బోర్డుల రగడ -
‘కన్నడ’ బోర్డుల రగడ
బనశంకరి: వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయంపై దర్శనమిచ్చే సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్ల(నామఫలకాల)లో 60 శాతం బోర్డులు కన్నడలోనే ఉండాలనే బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) నిబంధన తాజాగా బెంగళూరు నగరంలో బోర్డుల విధ్వంసానికి దారితీసింది. కన్నడ నగరంలో వ్యాపారం చేసే వారు ఎవరైనా సరే తమ కార్యాలయం బోర్డును కన్నడ భాషలోనే పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. ఇంగ్లి‹Ùలో కనిపించిన ప్రతీ సైన్‌బోర్డును ధ్వంసంచేశారు. కొన్నింటిపై నలుపు రంగు పూశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేఆర్వీ కనీ్వనర్ టీఏ నారాయణ గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర ఉన్నతాధికారి తుషార్ గిరినాథ్ స్పందించారు. సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడలోనే ఉండాలన్న నిబంధనను ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి తెస్తామని, నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. -
ఇక అన్ని దుకాణాల పేర్లు తెలుగులోనే!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని దుకాణాల పేర్లన్నీ ఇక తెలుగులోనే ఏర్పాటు చేయాలంటూ జీవో జారీ అయింది. ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రతిచోట అన్ని దుకాణాల శిలాఫలకాలపై ఆంగ్ల భాష అక్షరాలే ఎక్కువగా దర్శనమిచ్చేవి. తెలుగు భాష అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇకపై దుకాణాల శిలాఫలకాలపై తెలుగు అక్షరాలే ఉండేలా చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే తెలుగు భాష అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై అన్ని దుకాణాల శిలాఫలకాలు తెలుగులోనే దర్శనమివ్వనున్నాయి.