అన్ని దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని దుకాణాల పేర్లన్నీ ఇక తెలుగులోనే ఏర్పాటు చేయాలంటూ జీవో జారీ అయింది. ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రతిచోట అన్ని దుకాణాల శిలాఫలకాలపై ఆంగ్ల భాష అక్షరాలే ఎక్కువగా దర్శనమిచ్చేవి.
తెలుగు భాష అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇకపై దుకాణాల శిలాఫలకాలపై తెలుగు అక్షరాలే ఉండేలా చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే తెలుగు భాష అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై అన్ని దుకాణాల శిలాఫలకాలు తెలుగులోనే దర్శనమివ్వనున్నాయి.