boards
-
ఎంబీబీఎస్‌కు నీలం.. ఆయుర్వేదకు ఆకుపచ్చ!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సహా ఇతర స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు తప్పనిసరిగా నీలం (బ్లూ) రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు పెట్టే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులు నిజమైన వైద్యులను గుర్తించేలా, ఏ తరహా వైద్యుడని తెలుసుకునేలా.. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ ఈ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులు తమ ప్రత్యేకతను తెలిపే రంగు (కలర్ కోడెడ్) బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అటువంటి రంగు బోర్డుల వల్ల రోగులు మోసపోరనీ, నకిలీ డాక్టర్లను పట్టుకోవచ్చని అంటున్నారు. తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని... అలాంటి వారికి ఇలాంటి నిబంధన చెక్ పెడుతుందని చెబుతున్నారు. ప్రజలకు సులభంగా కన్పించాలి కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ ప్రకారం కలర్ కోడెడ్ బోర్డుపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, ఇతర సంబంధిత వివరాలను చూపాలి. ఆయా బోర్డులపై వారు చేసే వైద్యం, ఆ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు ప్రదర్శించాలి. ప్రజలకు సులభంగా కనిపించేలా ఈ సమాచారాన్ని ఆసుపత్రి ఆవరణలోని ప్రముఖ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులే గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రంగు కోడెడ్ బోర్డులు పెట్టని ప్రైవేట్ ఆసుపత్రులపై అక్కడి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టనుంది. పెద్దయెత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధన తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మోసగాళ్ల నుండి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని డాక్టర్ అర్షియ కోరారు. -
‘కన్నడ’ బోర్డుల రగడ
బనశంకరి: వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయంపై దర్శనమిచ్చే సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్ల(నామఫలకాల)లో 60 శాతం బోర్డులు కన్నడలోనే ఉండాలనే బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) నిబంధన తాజాగా బెంగళూరు నగరంలో బోర్డుల విధ్వంసానికి దారితీసింది. కన్నడ నగరంలో వ్యాపారం చేసే వారు ఎవరైనా సరే తమ కార్యాలయం బోర్డును కన్నడ భాషలోనే పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. ఇంగ్లి‹Ùలో కనిపించిన ప్రతీ సైన్‌బోర్డును ధ్వంసంచేశారు. కొన్నింటిపై నలుపు రంగు పూశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేఆర్వీ కనీ్వనర్ టీఏ నారాయణ గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర ఉన్నతాధికారి తుషార్ గిరినాథ్ స్పందించారు. సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడలోనే ఉండాలన్న నిబంధనను ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి తెస్తామని, నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. -
రంధ్రాలున్నాయ్ జాగ్రత్త!
సాధారణంగా ఏ ఊరెళ్లినా.. కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త అనో..దొంగలున్నారు జాగ్రత్త అనో బోర్డులు చూస్తుంటాం.కానీ దక్షిణ ఆస్ట్రేలియాలోని కూబర్ పెడీ పట్టణానికి వెళ్తే.. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త అనే బోర్డులు దర్శనమిస్తాయ్. ఇంతకీ అక్కడ రంధ్రాలు ఎందుకు ఉన్నాయ్? లోపల ఏం జరుగుతోంది? ఆ పట్టణ కథాకమామీషు ఏమిటి తెలుసుకోవాలని ఉందా? అయితే చలో కూబర్ పెడీ.. మైనింగ్ నుంచి మొదలై.. కూబర్ పెడీ.. దక్షిణ ఆ్రస్టేలియాలోని ఓ మైనింగ్ క్షేత్రం. ఒపాల్ (రత్నం వంటి విలువైన రాయి) గనులకు నిలయంగా పేరొందిన ఈ ప్రదేశం అడిలైడ్‌కు వాయువ్యంగా 590 మైళ్ల దూరంలో స్టువర్ట్ హైవేపై ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఒపాల్స్లో ఎక్కువ భాగం ఈ గ్రేట్ విక్టోరియా ఎడారి అంచున ఉన్న స్టువర్ట్ శ్రేణిలోని మైనింగ్ సైట్ నుంచే వస్తుంది. అసలు ఇక్కడ ఒపాల్ను కనుక్కోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. 1915లో విల్లీ హచిసన్ అనే బాలుడు తన తండ్రి జేమ్స్‌తో కలిసి గోల్ఫ్ ప్రాక్టీసింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. గోల్ఫ్ ఆడే క్రమంలో ఓ చోట ఒపాల్ను చూశాడు. అంతే.. అప్పటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం క్రమంగా పెద్ద పట్టణంగా మారిపోయింది. 1920లో ఈ ప్రాంతానికి కూబర్ పెడీ అని పేరు పెట్టారు. 1960లో దీనిని పట్టణంగా గుర్తించారు. అప్పటి నుంచి ఇది బాగా అభివృద్ధి చెందింది. స్థానికులు అక్కడే ఉంటూ మైనింగ్ చేసేవారు. వేడి నుంచి తప్పించు కోవడానికి.. ఎడారి ప్రాంతం కావడంతో అక్కడ వేసవికాలం ఉండే నాలుగు నెలల కాలం భగభగా మండిపోయేది. ఆ నాలుగు నెలలు ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి అక్కడివారంతా మైనింగ్ గనుల్లో ఉండేవారు. అనంతరం ఆ భూగర్భంలోనే తాము ఉండటానికి వీలుగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్లంటే ఏదో సాదాసీదా నిర్మాణాలనుకుంటే పొరపడినట్టే. కోటలను తలపించేలా విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు. అంతేకాదు.. హోటళ్లు, స్టోర్లు, లైబ్రరీలు, షాపింగ్ సెంటర్లు, క్రీడా ప్రదేశాలు, ఈత కొలనులు, విశాలమైన స్నానపు గదులు, చర్చిలు.. ఇలా ఒకటేమిటి? భూమిపై పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వసతులన్నీ అక్కడ ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం, నీటి వసతి, డ్రైవ్ ఇన్ మూవీ థియేటర్, గడ్డి లేని గోల్ఫ్ కోర్సు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సూర్యకాంతి మినహా సమస్తమూ భూమిపై ఉన్నట్టే ఉంటుంది. కూబర్ పెడీని పై నుంచి చూస్తే.. బోలెడు రంధ్రాలు కనిపిస్తాయి. వీధులన్నీ దుమ్ముతో ఉంటాయ్. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త.. అనే హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ ఆ రంధ్రాల లోపల ఓ భూగర్భ స్వర్గం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అక్కడ భూమిపై 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే.. లోపల 23 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక లోపల కరెంటు అవసరాలను సొంతంగానే తీర్చుకుంటున్నారు. 70 శాతం కరెంటును గాలి, సౌరశక్తి ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ భూగర్భ పట్టణ జనాభా దాదాపు 2500 మంది. నాలుగు మీటర్ల లోతులో.. కూబర్ పెడీలో భూగర్భ భవనాలు తప్పనిసరిగా నాలుగు మీటర్లు (13 అడుగులు) లోతులో ఉండాలి. పైకప్పులు కూలిపోకుండా చూసుకునేందుకే ఈ నాలుగు మీటర్ల నిబంధన విధించారు. ఈ రాతి కింద ఎల్లప్పుడూ 23 డిగ్రీల ఉష్ణోగ్రతతో తేమగా ఉంటుంది. అక్కడ నేలపై వేసవిలో విపరీతమైన వేడి.. శీతాకాలంలో భరించలేని చలి ఉంటుంది. ఒక్కోసారి రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కానీ భూగర్భ గృహాలు కచి్చతమైన గది ఉష్ణోగ్రత వద్ద సంవత్సరం పొడవునా ఉంటాయి. పైగా ఇందులో ఇళ్లు చాలా సరసమైన ధరకే లభిస్తాయండోయ్. మూడు పడక గదుల ఇల్లు దాదాపు 26వేల అమెరికా డాలర్లకు వచ్చేస్తుంది. మన రూపాయల్లో చెప్పాలంటే... దాదాపు రూ.21.62 లక్షలు. అదే సమీపంలోని అడిలైడ్‌లో సగటు ఇంటి ధర 4.57 లక్షల అమెరికా డాలర్లు(దాదాపు రూ.3.80 కోట్లు). చూశారా ఎంత వ్యత్యాసం ఉందో? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రయోజనాలివీ.. భూగర్భ పట్టణంలో నివసించడం వల్ల భూకంపాల నుంచి కొంత వరకు రక్షణ లభిస్తుంది. ఈగలు, దోమల, ఇతరత్రా కీటకాల బెడద ఉండదని స్థానిక నివాసి రైట్ వెల్లడించారు.అవి చీకటి, చలిలోకి రావడానికి ఇష్టపడవని వివరించారు. మనం కూడా ప్రస్తుతం అటు వేడితోనూ.. ఇటు దోమలతోనూ చాలా ఇబ్బందులు పడుతున్నాం.. ఇలాంటి భూగర్భ ఇళ్లేవో ఇక్కడ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో కదా? -
కేంద్రం ఎలా చెబితే అలా
సాక్షి, హైదరాబాద్: కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై తెలుగు రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాల వివరాలను కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్రానికి నివేదించనున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన నెల రోజుల్లోగా గెజిట్‌లోని అంశాల అమలుకు నిర్దిష్ట కార్యాచరణ పూర్తి చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన సమన్వయ కమిటీ, బోర్డుల అత్యవసర భేటీ వివరాలను మంగళవారమే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక రూపంలో పంపనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా బోర్డులు తదుపరి కార్యాచరణను మొదలు పెట్టే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అత్యవసర భేటీ అసంపూర్ణమే.. ఈ నెల 3న బోర్డులు ఉమ్మడిగా నిర్వహించిన సమన్వయ కమిటీ భేటీకి దూరంగా ఉన్న తెలంగాణ, సోమవారం నాటి అత్యవసర బోర్డుల భేటీకి కూడా దూరంగా ఉంది. సోమవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో బోర్డులకు సిబ్బంది నియామకం, నిధుల విడుదల, బోర్డు స్వరూపం తదితరాలపై చర్చించారు. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం, అనుమతుల్లేని ప్రాజెక్టులు, సీఐఎస్ఎఫ్ భద్రత, విద్యుదుత్పత్తి వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపకల్పనకు ఏపీ సహకారాన్ని బోర్డులు కోరాయి. గెజిట్‌లో పేర్కొన్న మేరకు అన్ని నివేదికలు, వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. దీనిపై స్పందించిన ఏపీ షెడ్యూల్–2, 3లో పేర్కొన్న కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపింది. వీటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొంది. దీంతో కేంద్రానికి నివేదించే అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని బోర్డులు పేర్కొన్నాయి. బోర్డుల నిర్వాహక వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించాలని కోరగా అందుకు ఏపీ అంగీకరించింది. అనంతరం బోర్డులు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. తెలంగాణ సభ్యులు ఎవరూ ఈ భేటీకి హాజరు కాలేదని తెలిపాయి. వివిధ అంశాలపై ఏపీ అధికారుల స్పందనను తెలియజేశాయి. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత అంశంపై కేంద్ర హోంశాఖతో కేంద్ర జల్‌శక్తి శాఖ చర్చిస్తోందని తెలిపాయి. నిర్దిష్ట గడువులకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరాయి. గెజిట్ అమలుకు సహకరిస్తాం: ఏపీ బోర్డులకు సంబంధించి వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 14 నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని, దీనికి తగ్గట్టుగా ప్రాజెక్టుల వివరాలు బోర్డులకు అందిస్తామన్నారు. -
ఇంట్లో విద్యుత్ సమస్యలు.. స్విచ్ బోర్డు రిపేర్లు తెలుసుకోండిలా..
సాక్షి, వెబ్ డెస్క్: సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలో విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యలను తలెత్తుతుంటాయి. రాత్రివేళ అకస్మాత్తుగా పవర్ పోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపోయిందని అనుకుంటాము. అయితే, చిన్న చిన్న ఎలక్ట్రికల్ సమస్యలు.. కరెంట్ బల్బ్‌లు మార్చటం, తెగిపోయిన ఫ్యూజ్ స్థానంలో మరోటి అమర్చటం వంటి రిపేర్లను సులభంగానే చేసుకోగలగుతాము. కానీ ఇంట్లోని స్విచ్‌బోర్డులో సమస్య ఉంటే మాత్రం రిపేర్ చేసే సాహసం చేయము. ఎందుకంటే స్విచ్ బోర్డుల్లో పలు రకాల ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి కనుక. పవర్ సర్యూట్లు ఎక్కడ అనుసంధానం కోల్పోయిందో గుర్తించలేము. అయితే ఇటువంటి వాటిని సంబంధిత ఎలక్ట్రీషియన్స్ మాత్రమే బాగుచేయగలరు. స్విచ్ బోర్డులోని సర్క్యూట్స్ ఇంట్లోని వంట గది, బెడ్రూం, హాల్, బాత్ రూంలకు అనుసంధానమై ఉంటాయి. కరెంట్ వస్తూ, పోతూ ఉండటంతో తరచూ స్విచ్ బోర్డులో సమస్యలు ఏర్పాడతాయి. అయితే కొన్ని సార్లు స్విచ్ బోర్డులు షార్ట్ సర్క్యూట్స్ కారణంగా పేలిపోయి ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చూశాం. అయితే మీ ఇంట్లోని స్విచ్ బోర్డుల పరిస్థితి ఎలా ఉందో? ఎప్పుడు అవి రిపేర్ దశకు చేరుకున్నాయో తెలుసుకుంటే చాలా ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చు. స్విచ్ బోర్డులు రిపేర్‌కు వచ్చాయని తెలుసుకొనే కొన్ని సంకేతాలు మీ కోసం.. 1. స్విచ్ బోర్డుల వద్ద కాలిపోయిన వాసన రావటం.. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డుల వద్ద కాలిపోయిన వాసన రావటం మనం గమనిస్తాము. కానీ, ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. అయితే కరెంట్ ఓవర్ లోడ్ వల్ల స్విచ్ బోర్డుల్లో ఉండే వైర్ల నుంచి కాలిపోయిన వాసన వస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జాగ్రత్తపడి ఎలక్ట్రిషియన్‌ను సంప్రదించి కొత్త వాటిని మార్చుకోవాలి. 2. కాలం చెల్లిన పాత స్విచ్ బోర్డులు.. ఇల్లు కట్టినప్పటి నుంచి కొంత మంది స్విచ్ బోర్డులను అసలు మార్చకుండా కాలం గడుపుతారు. అయితే సుమారు 20 ఏళ్లు దాటిన స్విచ్ బోర్డులను తప్పనిసరిగా మార్చుకోవాలి. మారుతున్న సాంకేతికతతో కొత్త ఎలక్ట్రికల్ బోర్డులను ఉపయోంగిచడంతో పలు విద్యుత్ సమస్యలను నిలువరించవచ్చు. పాత వాటిని మార్చటంతో నాణ్యమైన కరెంట్ సరాఫరా ఇళ్లలో పొందవచ్చు. 3. బల్బులు మినుకు మినుకు మంటూ ఆగిపోవటం.. వైర్ల మధ్య చోటు చేసుకున్న లూజ్ కనెక్షన్ల కారణంగా తరచూ ఇంట్లోని బల్బులు మినుకు మినుకు మంటూ ఆగిపోతాయి. అంటే ఇళ్లలోకి వచ్చే విద్యుత్‌తో స్విచ్ బోర్డులపై అధికంగా లోడ్ పడుతోందని గమనించాలి. లేదంటే వాటికి ఆ కరెంట్‌ను సరఫరా చేసే సామర్థ్యం తగ్గినట్టు గుర్తించాలి. 4. సర్క్యూట్స్ పాడవటంతో కరెంట్ ట్రిప్ కావటం.. విద్యుత్ అధిక లోడ్, ఆకస్మికంగా కరెంట్ రావటం, పోవటం కారణంగా స్విచ్ బోర్డులోని పవర్ సర్కూట్లు పాడవుతాయి. పాడైన స్విచ్ బోర్డుల్లో ఉండే విద్యుత్ సర్క్యూట్స్ కారణంగా కరెంట్ తరచూ ట్రిప్ అవుతూ ఉంటుంది. పలు చిన్న, చిన్న సర్క్యూట్స్ తో అనుసంధానమయ్యే స్విచ్ బోర్డులు కరెంట్ లోడ్‌ను తట్టుకోవటం లేదని గుర్తించాలి. 5. తరచూ ఫ్యూజ్‌లు మండిపోవటం.. కరెంట్ సరాఫరా మార్పుల్లో భాగంగా తరచూ స్విచ్ బోర్డులో ఉండే ఫ్యూజ్‌లు మండిపోతాయి. స్విచ్ బోర్డులు కరెంట్‌ను కంట్రోల్ చేయకపోతే కూడా తరచూ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అయి ఫ్యూజ్ మండిపోయే అవకాశం ఉంటుంది. అయితే ముందుగానే స్విచ్ బోర్డులను పనితీరు, వాటి స్థితిని గుర్తించగలిగితే ఇళ్లలో విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. -
‘సిగరెట్’ తరహాలో గంగ హెచ్చరికలు
న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న హెచ్చరిక తరహాలో గంగా నది కాలుష్యంపై పరీవాహక ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(ఎన్ఎంసీజీ)ను ఆదేశించింది. గంగా నది తీవ్రస్థాయిలో కలుషితం కావడంపై ఎన్జీటీ ఆవేదన వ్యక్తం చేసింది. హరిద్వార్ నుంచి ఉన్నావ్ మధ్య గంగా నది నీరు కనీసం స్నానానికి పనికిరావని వ్యాఖ్యానించింది. ‘ ప్రజలు గంగా నీటిని భక్తి భావంతో సేవిస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. కేవలం సిగరెట్ ప్యాకెట్ల మీదే ‘పొగతాగడం మీ ఆరోగ్యానికి హానికరం’ అని రాస్తున్నప్పుడు ఈ నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు ఎందుకు చెప్పకూడదు?’’ అని ఎన్జీటీ బెంచ్ ప్రశ్నించింది. గంగా నదీ తీరంలో ప్రతి 100 కి.మీ ఓ చోట నీటి స్వచ్ఛతపై బోర్డులను ఏర్పాటు చేయాలని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ(ఎన్ఎంసీజీ)ను ఎన్జీటీ ఆదేశించింది. అక్కడి నీటిని తాగటానికి, స్నానం చేయటానికి వాడొచ్చా? లేదా? అన్న విషయాన్ని బోర్డుల్లో స్పష్టంగా పేర్కొనాలంది. -
రోగులకు అనవసర పరీక్షలు చేయించొద్దు
కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్యులు అనవసర పరీక్షలు చేయించొద్దని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో ఉన్న ఓ ఆసుపత్రిలో ఇటీవల పరీక్షలకే రూ.15లక్షల బిల్లు వేశారని ఫిర్యాదు వచ్చిందన్నారు. ఇలా రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రైవేటు నర్సింగ్ హోమ్‌ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మానవతా దృక్పథంతో వైద్యం అందించాలన్నారు. నర్సింగ్ హోమ్‌లలో పనిచేస్తున్న వైద్యుల జాబితాను 15 రోజులకు ఒకసారి డీఎంహెచ్ఓకు పంపించాలని ఆదేశించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో, స్కానింగ్ కేంద్రాల్లో సేవల ధరలు, వైద్యుల ధ్రువీకరణ పత్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వై. నరసింహులు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రైవేటు నర్సింగ్ హోమ్‌ల యజమానులు, వైద్యులు పాల్గొన్నారు. -
అటో.. ఇటో.. ఎటో..!
రాకపోకలు తెలుపుతూ ఊర్ల పేర్లతో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు అగమ్యగోచరంగా కనిపిస్తున్నాయి, వాహనదారులు చూసి తికమక పడి తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. బోర్డు ఉన్నా అర్థంకాక అడిగి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వేల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సూచిక బోర్డుల్లో తప్పులు దొర్లకుండా చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డుపై ఏర్పాటు చేసిన బోర్డులో రోడ్ల పేర్లు, దూరం తప్పుల తడకగా ఉంది. మీటర్లు అని రాయాల్సినచోట కిలోమీటర్లు, దుర్గాపురం సమీపంలో ఏర్పాటు చేసిన బోర్డులు సగం విరిగి ఉన్నాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడకు ఎంతో మంది కొత్తవారు రోజూ వస్తుంటారు. సూచికబోర్డుల్లో దొర్లిన ఈ తప్పులను సరిచేయడంపై దృష్టిపెట్టాల్సి ఉంది. – ఫొటోలు నడిపూడి కిషోర్, విజయవాడ -
పవర్‌హౌస్‌లో 2 ప్యానల్ బోర్డులు
రూ.39 లక్షల వ్యయంతో ఏర్పాటుకు నిర్ణయం వేదసార రత్నావళి పుస్తకాలు పునర్ముద్రణ వచ్చే నెలలో చెన్నై, దిల్లీలలో సత్యదేవుని వ్రతాలు అన్నవరం దేవస్థానం పాలకవర్గ సమావేశంలో తీర్మానాలు అన్నవరం : అన్నవరం దేవస్థానంలో విద్యుత్ సరఫరా మెరుగుకు, షార్ట్‌సర్క్యూట్ వంటి ప్రమాదాల నివారణకు ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్‌ను అనుసంధానం చేస్తూ రూ.39 లక్షల వ్యయంతో కొండదిగువన పవర్‌హౌస్ వద్ద రెండు ప్యానల్‌బోర్డులు ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలకవర్గం నిర్ణయించింది. దేవస్థానం ఛైర్మన్ రాజా ఐవీ రోహిత్ అధ్యక్షతన సోమవారం రత్నగిరిపై జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈఓ కే నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, ఏఈఓలు నటరాజ్, సాయిబాబా, వైఎస్ఆర్ మూర్తి, పీఆర్ఓ తులా రాము ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను చైర్మన్, ఈఓ విలేఖర్లకు వివరించారు. దేవస్థానంలో విద్యుత్ రక్షణ చర్యలు, వినియోగం, చార్జీల తగ్గింపుపై చర్చ జరిగింది. గతేడాది వరకూ దేవస్థానానికి నెలకు రూ.20 లక్షల వరకూ విద్యుత్ బిల్లు వచ్చేది. అయితే విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాక ఆ బిల్లు రూ.ఎనిమిది లక్షలకు తగ్గింది. ప్రస్తుతం సత్యగిరి మీద గల పవర్‌హౌస్ వద్ద మాత్రమే ప్యానల్ బోర్డు ఉంది. దిగువన పవర్‌హౌస్‌లో ప్యానల్ బోర్డులు లేక అక్కడ తరుచూ విద్యుత్ సరఫరాలో సమస్యలు ఎదురవుతుండడంతో అక్కడా ప్యానల్ బోర్డులు ఏర్పాటు చేయాలని గత నెలలో అన్నవరం దేవస్థానానికి విచ్చేసిన దేవాదాయశాఖ విద్యుత్ కన్సెల్టెంట్ సీఎంఆర్ మోహన్‌రావు సూచించారు. ఆయన సూచనల మేరకు పవర్‌హౌస్‌లో ప్యానల్ బోర్డులు ఏర్పాటుకు తీర్మానించారు. సమావేశంలో చర్చకు వచ్చిన ఇతర అంశాలు: * ప్రముఖ వేదపండితుడు ఉప్పులూరి గణపతిశాస్త్రి రాసిన వేదసార రత్నావళి పుస్తకం రెండు భాగాలను పునర్ముద్రించి దేవస్థానంలో విక్రయించాలని తీర్మానించారు. రెండు భాగాలు కలిపి వేయి సెట్లు ముద్రించడానికి రూ.2,96,400 వ్యయమవుతుందని నిర్ణయించారు. రెండు సెట్లు కలిపి రూ.350కి విక్రయిస్తారు. * హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్ ధర్మప్రచారంలో భాగంగా దేవాదాయశాఖ కమిషనర్ నియమించిన ఇద్దరు భజన గురువులకు ఒక్కొక్కరికీ రూ.పదివేలు చొప్పున వేతనం, రూ.ఐదువేల చొప్పున అలవెన్స్‌లు చెల్లించాలని నిర్ణయించారు. * ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆహ్వానం మేరకు ఏప్రిల్ 14న చెన్నైలో, బాలరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆహ్వానం మేరకు ఏప్రిల్ 22, 24 తేదీలలో ఢిల్లీలో సామూహిక సత్యదేవుని వ్రతాల నిర్వహణకు పురోహితులను, పూజాసామగ్రిని పంపించాలని తీర్మానించారు. * ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకూ రత్నగిరిపై భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని తీర్మానించారు. -
హెచ్‌పీఎస్ స్థలాలను కాపాడండి
పంజగుట్ట: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు సంబంధించిన స్థలాలను కబ్జాల నుంచి ప్రభుత్వం కాపాడాలని హెచ్‌పీఎస్ వైస్ చైర్మన్ గుప్తి నోరియా కోరారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్కూల్‌కు 90 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ స్కూల్లో మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు ఎంతో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు విద్యనభ్యసించారన్నారు. ఇంత చరిత్ర ఉన్న తమ విద్యాసంస్థ స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తమ స్కూల్ సర్వే నంబర్ 147/1లోని 2.26 ఎకరాల భూమిని కొందరు ప్రజాప్రతినిధులు, స్థానికులు కబ్జా చేశారన్నారు. దీంతో తమ స్థలాలపై హక్కులను సూచిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారని, గత ఏడాది ఆగస్టులో వాటిని తొలగించి కబ్జా చేశారని దీంతో తాము హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చామని తెలిపారు. ఈ ఏడాది హైకోర్టు సెలవులు ఉన్న క్రమంలో ఏకంగా తమ స్థలంలో ప్రహరీ నిర్మించారని, కోర్టు కేసు ఉన్న స్థలంలో ఎలా నిర్మాణాలు చేపడతారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో హెచ్‌పీఎస్ రిజిస్ట్రార్ కల్నల్ శర్మ, కార్యదర్శి ఫయాజ్‌ఖాన్ పాల్గొన్నారు. -
డ్రైవర్ బాబూ.. ఈ బోర్డులు గమనిస్తూ సాగిపో...!!
చల్లపల్లి : వైజాగ్ – చెన్నై జాతీయ రహదారిలో విజయవాడకు ప్రత్నామ్యాయంగా మారిన చల్లపల్లిలో పోలీసులు రూట్ సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. కృష్ణా పుష్కరాలకు విజయవాడలో వాహనాల రద్దీ నియంత్రించేందుకు వైజాగ్ – చెన్నై జాతీయ ర హదారిలో విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు మచిలీపట్నం – చల్లపల్లి – పులిగడ్డ – రేపల్లె – ఒంగోలు మీదుగా మళ్లించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు దృష్ట్యా ఈ రూట్లోకి కొత్తగా వచ్చే డ్రైవర్ల అవగాహన కోసం బోర్డులు ఏర్పాటు చేశారు. చల్లపల్లి నుంచి ఒంగోలు 137 కిలోమీటర్లు, చీరాల 84 కిలోమీటర్లు దూరం. ఈ మేరకు బందరురోడ్డులో ప్రధాన కూడలికి చేరువలో రూట్ బోర్డు పెట్టారు. విజయవాడ, మచిలీపట్నం వైపుల నుంచి వచ్చే వాహనాలకు డైవర్షన్ బోర్డులను ప్రధానకూడలిలో ఏర్పాటు చే శారు. -
మార్గసూచికలు ఏర్పాటు
తాడేపల్లి రూరల్ : సీతానగరం పుష్కర ఘాట్లకు విచ్చేసే భక్తుల సమాచారం కోసం తాడేపల్లి మునిసిపల్ అధికారులు సోమవారం వివిధ ప్రాంతాల్లో మార్గ సూచికలను ఏర్పాటు చేశారు. పుష్కర నగర్ల నుంచి సీతానగరం ఘాట్లకు వచ్చే మార్గాలను సూచిస్తూ వంద బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే పుష్కర ఘాట్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సూచిక బోర్డులను కూడా రహదార్ల వెంట, ప్రతి 500 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. -
వీరి వీరి గుమ్మడి పండు..వీధి పేరేమీ?
అనంతపురం మెడికల్ : అనంతపురం నగరంలో ఏ కాలనీ ఎక్కడ మొదలవుతుందో సూచించే బోర్డులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని కాలనీలకు మాత్రమే ఆయా కాలనీల పేర్లను సూచిస్తూ బోర్డులు కనిపిస్తాయి. ఇలా బోర్డులు ఉన్నవాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. లేనివి వందల్లో ఉంటాయి. నగర శివారులోని రంగస్వామినగర్, భాగ్యనగర్, భవానినగర్, కృష్ణదేవరాయనగర్ ఇలా ురికొన్ని కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కాలనీల పేర్లతో బోర్డులు కనిపిస్తాయి. విద్యుత్‌నగర్‌లోని కొన్ని వీధులకు బోర్డులు దర్శనమిస్తాయి. నగరంలోని అరవిందనగర్, ఓబుళదేవనగర్, జీసెస్‌నగర్, సాయినగర్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, కమలానగర్, రెవెన్యూ కాలనీ, శ్రీనివాసనగర్, రాంనగర్, మారుతీనగర్, అరుణోదయ కాలనీ, ద్వారకానగర్, అశోక్‌నగర్, ఆదిమూర్తినగర్, సోమనాథ్‌నగర్, ఒకటవ రోడ్డు నుంచి ఆరవ రోడ్డు వరకు, గుల్జార్‌పేట, కోర్టురోడ్డు, కొవ్వూరునగర్, లక్ష్మినగర్, రాణీనగర్, బ్రాహ్మణవీధి, రహమత్‌నగర్, హౌసింగ్ బోర్డు, లక్ష్మినరసయ్య కాలనీ, ఆదర్శనగర్, విద్యుత్‌నగర్ -2, హౌసింగ్ బోర్డు, బుడ్డప్పనగర్, వెంకటేశ్వరనగర్, సంగమేష్‌నగర్, శ్రీనగర్ కాలనీ, విజయనగర్ కాలనీ, శారదాగర్, పాతూరులోని మున్నానగర్, బోయవీధి, వేణుగోపాల్‌నగర్, నీరుగంటి వీధి, ఉమానగర్, అంబారపు వీధి... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాలనీలకు ఆయా కాలనీ ల పేర్లను లేదా కాలనీలోని వీధుల్ని తెలియజేస్తూ బోర్డులు కనిపించవు. ఉద్దేశం మధ్యలోనే ఆగింది : కార్పొరేషన్ కమిషనర్‌గా నీలకంఠారెడ్డి ఉన్న సమయంలో కాలనీలకు బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వీధులకు బో ర్డులు ఉంచడం వంటి చర్యలకు ఉపక్రమించారు. ఆ క్రమంలోనే విద్యుత్నగ ర్ ప్రాంతంలో వీధులకు బోర్డులు ఏర్పాటు చేయించి వాటిపై కాలనీ వీధి నెం బర్తో పాటు ఆ వీధిలోని ఇంటి నెంబర్లు కూడా రాయించారు. ఇంతలో ఆయన బదిలీ కావడంతో ఆ పని మధ్యలోనే ఆగిపోయింది. తరువాత వచ్చినవారు దాని గురించి పట్టించుకోకపోవడంతో కార్యక్రమం సాగలేదు. కాలనీల్లో బోర్డుల ఏర్పాటు జరగాలి: 2010 నుంచి 2014 జూలై వరకు అంటే దాదాపు నాలుగేళ్లగా కార్పొరేషన్‌కు పాలకవర్గం లేదు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కొలువు దీరారు. ప్రజలకు మౌలిక వసతులు అందించే క్రమంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ వస్తున్నారు. ఒక కాలనీని తెలుసుకోవడంలోనూ, వీధుల్ని తెలుసుకోవడంలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నగరంలో కాలనీలకు వాటి పేర్లను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలి. వీధులకు కాలనీ పేరుతో పాటు రోడ్డు నెంబర్, ఆ వీధిలోని ఇంటి నెంబర్లు ఉండేలా బోర్డులు ఏర్పాటు చేయడంపై పాలక వర్గం దృష్టి సారించాలి. -
అధికారులా...మాకో లెక్కా?
పభుత్వ హెచ్చరిక బోర్డులు విరిచి, పాక వేసి దర్జాగా చెరువు గర్భం దున్నిన వైనం పెట్రేగుతున్న ఆక్రమణదారులుఆయకట్టు రైతుల కలవరం ఆ చెరువు ఆయకట్టు రైతుల అమాయకత్వమో, రెవెన్యూ సిబ్బంది మెతక వైఖరో తెలియదు గానీ అప్పలమ్మపాలెం, కుముందానిపేట గ్రామాల్లోని ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడోసారి అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ దర్జాగా చెరువు గర్భాన్ని దున్నేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాక్షాత్తూ తహశీల్దార్ వేయించిన హెచ్చరిక బోర్డు పీకిపారేసి అదే స్థలంలో మరలా పెద్దపాక వేసేశారు. అంతేకాదు...చెరువునీరు అడ్డంగా ఉందన్నట్టుగా గట్టు తెగనరికి నీటిని వదిలేశారు. వివరాలివి. రావికమతం: మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏటా జరుగుతున్న ఈ దౌర్జన్యంపై సదరు చెరువు ఆయకట్టు రైతులు మడకా సత్యారావు, మదుమంతి శ్రీను, రాజాన అప్పారావు, చల్లపురెడ్డి అప్పారావు, మడకా శ్రీను, అప్పారావు, మిరియాల గోవింద, నాగేశ్వరరావు తదితర 40 మంది రైతు లు ఏటా అధికారులకు, ప్రజా ప్రతినిధులకూ మొరపెట్టుకుంటున్నారు. వారు తూతూ మంత్రంగా ఏవో చర్యలు చేపడుతున్నారు. మళ్లీ ఏడాది పరిస్థితి షరామామూలే. అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన సర్వే నెంబరు 196, 235 లో నల్లకొండమ్మతల్లి చెరువు ఉంది. ఆ చెరువు గర్భం ఆరెకరాలు, కాగా మరో రెండెకరాలను సమీప ఆయకట్టు రైతులు వేరొక రైతు నుంచి కొనుగోలు చేసి చెరువుకు కేటాయించేశారు. కాగా గ్రామంతో పాటు, కుముందానిపేట, గదబపాలెం గ్రామాలకు చెందిన పోతల నర్సింగరావు, ఇంగళపు పేరయ్య, శ్రీను, కటారి సత్తిబాబు, శలాది సత్తిబాబు, మారబోయిన చిన్నలు చెరువు గర్భంతో పాటు తాము కొనుగోలు చేసి చెరువుకు కేటాయించిన భూమిని సైతం ఆక్రమించి దున్నేసారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో చెరువు దున్ని, పాకలు వేసి, గట్టు నరికినందుకు కలెక్టర్‌కు, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయగా వాటన్నిం టినీ తొలగించి, వారిపై కేసులు కూడా నమోదు చేశారన్నారు. మళ్లీ గట్టు నరికేయడంతో పాటు చెరువులో పాకలు వేసేసారని, చెరువు మొత్తం దున్నేశారని ఆయకట్టురైతులు వాపోయారు. ఆ చెరువుకు గతంలో పని కి ఆహార పథకంలో రూ. 2లక్షలతోనూ, ఉపాధి హామీ పథకంలో రూ.4 లక్షల యాభైవేల వ్యయంతోనూ పనులు చేపట్టామని, ఇపుడు ఆయా బంటాలు కూడా ఆక్రమణదారులు కలియ దున్నేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ పాసుపుస్తకమే కారణమా? గతంలో ఆక్రమణదారులు ఆ చెరువుకు రెండు కిలోమీటర్ల దూరంలోని 237, 240 సర్వే నంబర్లుతో పాసు పుస్తకాలు చేయించి వాటిని ఆధారంగా చూపుతూ ఈ చెరువును దున్నేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీనిపై గత ఏడాది మండల సర్వేయర్ సర్వేలో రుజువైంది. ఆ సర్వే ఆధారంగా చర్యలు కూడా తీసుకున్నారు. రావిచెరువు కూడా : దీనితో పాటే అప్పలమ్మపాలెం రావిచెరువును కూడా ఆ గ్రామానికి చెందిన మరికొంత మంది రైతులు శనివారం సాయంత్రం దున్నేశారు. అయితే ఎవరు దున్నినదీ ఇంకా తెలియరావడం లేదని ఆ ఆయకట్టు రైతులు తెలిపారు. దీనిపై వీఆర్వో శ్రీనుకు ఫిర్యాదు చేసామని, సోమవారం కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తున్నట్టు తెలిపారు. కాగా ఈ విషయమై ఆర్ఐ గంగరాజును సాక్షి సంప్రదించగా చెరువును మళ్లీ దున్నేసిన వైనం తమ దృష్టికి వచ్చిందన్నారు. తహశీల్దార్ భాస్కరరావుకు తెలియజేశామన్నారు. ఆక్రమణ దారులపై నోటీసులు కూడా సిద్ధమయ్యాయన్నారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. -
త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
ఏఐసీసీ నిర్ణయం ఆధారంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎంపిక సంస్థాగత ఎన్నికలకు రోడ్ మ్యాప్ రూపొందించాం వచ్చే ఏడాది జులైలో కేపీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక సోనియాగాంధీ సూచించేంత వరకూ ఆ స్థానం నాదే కేపీసీసీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర్ సాక్షి, బెంగళూరు : బోర్డులు, కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల ఎంపిక త్వరలో ఉంటుందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు జీ. పరమేశ్వర్ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 110 బోర్డులు, కార్పొరేషన్లు ఉన్నాయన్నారు. వీటిలో దాదాపు 30 శాతం సంస్థలకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి అధికారులు అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఉండాలన్నారు. మిగిలిన 70 శాతం అన్ అఫిషియల్స్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఉండవచ్చున్నారు. ఈ స్థానాలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో రెండు రోజుల పాటు జరిగిన సమీక్ష సమావేశంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా మెజారిటీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారన్నారు. దిగ్విజయ్ సింగ్ కూడా సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాల్సిందిగా సూచించారన్నారు. అందువల్ల ఈ విషయంపై ఇక ఆలస్యం చేయకుండా త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అయితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ అంతిమ నిర్ణయం తీసుకోనుండగా ఈ సంస్థల 1,265 సభ్యులను మాత్రం తామే ఎంపిక చేస్తామన్నారు. అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉండవచ్చునన్నారు. రోడ్ మ్యాప్ రూపొందించాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికల కోసం నూతన రోడ్ మ్యాప్ రూపొందించినట్లు పరమేశ్వర్ తెలిపారు. దీని ప్రకారం డిసెంబర్ వరకూ పార్టీ కార్యకర్తల నమోదు ప్రక్రియ (మెంబర్షిప్ డ్రైవ్) ఉంటుందన్నారు. తర్వాత బూత్, డీసీసీ అధ్యక్షులు తదితర ఎన్నికలు ఉంటాయన్నారు. చివరిగా వచ్చే ఏడాది జులైలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం హై కమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించేంతవరకూ తాను ఇదే పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే దిశగా అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నామన్నారు. అదేవిధంగా దేశంలో మొదటిసారిగా అదే నెలలో ‘రాష్ట్ర స్థాయిలో ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ కన్వెన్షన్’ను కర్ణాటకలో ఏర్పాటుచేయాలని భావిస్తున్నామన్నారు. ఇందుకు సోనియా, రాహుల్‌గాంధీలను కూడా ఆహ్వానించనున్నామన్నారు. ఇక నవంబర్ 19న రాష్ట్రస్థాయి మహిళా కన్వెన్షన్, అటు తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర విభాగాల కన్వెన్షన్లను బెంగళూరు, హుబ్లీ, ధార్వాడ తదితర చోట్ల నిర్వహించనున్నట్లు పరమేశ్వర్ తెలిపారు. -
ఇక ఉద్వాసనే!
లోక్‌సభ ఫలితాల ప్రభావం .. విజయానికి సహకరించని, పని తీరు సరిగాలేని మంత్రులపై వేటు! జాబితాలో ఆరుగురు త్వరలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అసంతప్తి నేతలకు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు ప్రతిభకు పెద్ద పీట.. అన్ని జిల్లాలకు ప్రాధాన్యత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహకరించని, పని తీరు సరిగాలేని అమాత్యులకు ఉద్వాసన పలకడానికి అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతానికి ఈ జాబితాలో శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ ఉన్నారు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని కాంగెస్ భావిస్తోంది. ఒక వేళ అసంతప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచనలో కూడా ఉంది. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సరైన సహాయ సహకారాలు అందించని మంత్రులపై వేటు వేయాలని అధిష్టానం యోచిస్తోంది. వీరితో పాటే పని తీరు బాగా లేని మంత్రులకు కూడా ఉద్వాసన పలకనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ నేత ృత్వంలో మంత్రుల పని తీరును బేరీజు వేశారు. ప్రస్తుతానికి ఆరుగురు మంత్రుల నెత్తిపై కత్తి వేలాడుతోంది. మంత్రులు శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ పదవులను కోల్పోయే అవకాశాలున్నాయని సమాచారం. వీరిలో ప్రకాశ్ హుక్కేరి మొన్న జరిగిన ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మంత్రి వర్గంలో ఇప్పటికే మూడు ఖాళీలున్నాయి. కనుక కొత్తగా తొమ్మిది మందికి అవకాశం లభించవచ్చు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని అధిష్టానం భావిస్తోంది. ఒక వేళ అసంత ృప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచన కూడా ఉంది. పునర్వ్యవస్థీకరణలో అనుభవం, సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక వర్గం, ప్రాంతం లాంటి వాటిని పక్కన పెట్టి ప్రతిభకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రి వర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కలిగేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎగువ సభల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలపై చర్చించడానికి దిగ్విజయ్ సింగ్ ఈ నెలాఖరుకు ఇక్కడికి రానున్నారు. ఇదే సమయంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మల్లిఖార్జునకు స్థానం తోటలు, ఉద్యాన వనాల శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప వయో భారంతో బాధ పడుతున్నారు. ఆయన స్థానంలో కుమారుడు ఎస్ఎస్. మల్లిఖార్జునకు స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తప్పుకోవడానికి సిద్ధమయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీని వల్ల కీలకమైన రెవెన్యూ శాఖ అచేతనంగా పడి ఉంది. కరువు, వరదల సమయాల్లో ఆయన పర్యటనలకు వెళ్లే స్థితిలో లేరు. మునిసిపల్ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం అనేక శాఖలతో సతమతమవుతున్నారు. ఆయన పని తీరు బాగా లేదని పార్టీలో పెదవి విరుస్తున్నారు. గుల్బర్గ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న ఆయనకు అక్కడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మండ్యలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి రమ్య ఓటమి పాలైంది. దీనికి ఆయన బాధ్యత వహించాలనే మాటలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ అతి మంచితనమే ఆయన కొంప ముంచేట్లుంది. విద్యా శాఖ లోటు పాట్లను తెలుసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. శివమొగ్గ జిల్లాలోని సొంత నియోజక వర్గం తీర్థహళ్లిలోనే ఎక్కువ రోజులుంటారని సొంత పార్టీ వారే విమర్శిస్తుంటారు. -
మంత్రి వర్గ విస్తరణ
ముగ్గురికి చోటు కొందరికి శాఖల మార్పు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకం ‘లోక్‌సభ’ ఫలితాల తర్వాత కార్యాచరణ నీటి ఎద్దడి నివారణకు రూ. 516 కోట్లు ‘రేషన్’ పంపిణీ కాకుంటే అధికారులపై చర్యలు మైసూరు, న్యూస్‌లైన్ : రాష్ర్ట మంత్రి వర్గాన్ని త్వరలో విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రి వర్గంలో ముగ్గురికి చోటు కల్పించడంతో పాటు బోర్డులు, కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమిస్తామని వెల్లడించారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం రాత్రి ఇక్కడికి వచ్చిన ఆయన స్థానిక రామకృష్ణ నగరలోని తన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల పార్టీ పెద్దలు కొందరు మంత్రి వర్గ విస్తరణతో పాటు కొందరు మంత్రుల శాఖల మార్పు గురించి మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారని అన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, దీనిపై తానేమీ మాట్లాడదలచుకోలేదని తెలిపారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకాలపై అధిష్టానంతో చర్చించాల్సి ఉందని చెప్పారు. దీనిపై ఇదివరకే ఆయా జిల్లాల నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించామన్నారు. కాగా తాగు నీటి సమస్య పరిష్కారానికి రూ.516 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. 1,250కి పైగా గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ఈ నిధులు ఖర్చు చేస్తారని చెప్పారు. అనంతరం ఆయన తన నివాసం వద్ద గుమికూడిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, ప్రస్తుతం ఎలాంటి హామీలు ఇవ్వలేనని పేర్కొన్నారు. నియమావళి తొలగిపోయిన తర్వాత సమస్యలపై స్పందిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఆయన జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తాగు నీటికి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చౌక దుకాణాల ద్వారా సరుకులు సక్రమంగా పంపిణీ కాకపోతే సంబంధిత అధికారులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.