వీరి వీరి గుమ్మడి పండు..వీధి పేరేమీ? | The name given panduvidhi the pumpkins? | Sakshi
Sakshi News home page

వీరి వీరి గుమ్మడి పండు..వీధి పేరేమీ?

Published Sun, Sep 14 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

వీరి వీరి గుమ్మడి పండు..వీధి పేరేమీ?

వీరి వీరి గుమ్మడి పండు..వీధి పేరేమీ?

 అనంతపురం మెడికల్ : అనంతపురం నగరంలో ఏ కాలనీ ఎక్కడ మొదలవుతుందో సూచించే బోర్డులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని కాలనీలకు మాత్రమే ఆయా కాలనీల పేర్లను సూచిస్తూ బోర్డులు కనిపిస్తాయి. ఇలా బోర్డులు ఉన్నవాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. లేనివి వందల్లో ఉంటాయి. నగర శివారులోని రంగస్వామినగర్, భాగ్యనగర్, భవానినగర్, కృష్ణదేవరాయనగర్ ఇలా ురికొన్ని కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కాలనీల పేర్లతో బోర్డులు కనిపిస్తాయి. విద్యుత్‌నగర్‌లోని కొన్ని వీధులకు బోర్డులు దర్శనమిస్తాయి. నగరంలోని అరవిందనగర్, ఓబుళదేవనగర్, జీసెస్‌నగర్, సాయినగర్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, కమలానగర్, రెవెన్యూ కాలనీ, శ్రీనివాసనగర్, రాంనగర్, మారుతీనగర్, అరుణోదయ కాలనీ, ద్వారకానగర్, అశోక్‌నగర్, ఆదిమూర్తినగర్, సోమనాథ్‌నగర్, ఒకటవ రోడ్డు నుంచి ఆరవ రోడ్డు వరకు, గుల్జార్‌పేట, కోర్టురోడ్డు, కొవ్వూరునగర్, లక్ష్మినగర్, రాణీనగర్, బ్రాహ్మణవీధి, రహమత్‌నగర్, హౌసింగ్ బోర్డు, లక్ష్మినరసయ్య కాలనీ, ఆదర్శనగర్, విద్యుత్‌నగర్ -2, హౌసింగ్ బోర్డు, బుడ్డప్పనగర్, వెంకటేశ్వరనగర్, సంగమేష్‌నగర్, శ్రీనగర్ కాలనీ, విజయనగర్ కాలనీ, శారదాగర్, పాతూరులోని మున్నానగర్, బోయవీధి, వేణుగోపాల్‌నగర్, నీరుగంటి వీధి, ఉమానగర్, అంబారపు వీధి... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాలనీలకు ఆయా కాలనీ ల పేర్లను లేదా కాలనీలోని వీధుల్ని తెలియజేస్తూ బోర్డులు కనిపించవు.
 ఉద్దేశం మధ్యలోనే ఆగింది : కార్పొరేషన్ కమిషనర్‌గా నీలకంఠారెడ్డి ఉన్న సమయంలో కాలనీలకు బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వీధులకు బో ర్డులు ఉంచడం వంటి చర్యలకు ఉపక్రమించారు. ఆ క్రమంలోనే విద్యుత్‌నగ ర్ ప్రాంతంలో వీధులకు బోర్డులు ఏర్పాటు చేయించి వాటిపై కాలనీ వీధి నెం బర్‌తో పాటు ఆ వీధిలోని ఇంటి నెంబర్లు కూడా రాయించారు. ఇంతలో ఆయన బదిలీ కావడంతో ఆ పని మధ్యలోనే ఆగిపోయింది. తరువాత వచ్చినవారు దాని గురించి పట్టించుకోకపోవడంతో కార్యక్రమం సాగలేదు.
 కాలనీల్లో బోర్డుల ఏర్పాటు జరగాలి: 2010 నుంచి 2014 జూలై వరకు అంటే దాదాపు నాలుగేళ్లగా కార్పొరేషన్‌కు పాలకవర్గం లేదు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కొలువు దీరారు. ప్రజలకు మౌలిక వసతులు అందించే క్రమంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ వస్తున్నారు. ఒక కాలనీని తెలుసుకోవడంలోనూ, వీధుల్ని తెలుసుకోవడంలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నగరంలో కాలనీలకు వాటి పేర్లను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలి. వీధులకు కాలనీ పేరుతో పాటు రోడ్డు నెంబర్, ఆ వీధిలోని ఇంటి నెంబర్లు ఉండేలా బోర్డులు ఏర్పాటు చేయడంపై పాలక వర్గం దృష్టి సారించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement